POSH Act : ఉద్యోగం చేసే మహిళలు ఈ చట్టం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి

Best Web Hosting Provider In India 2024

POSH(Prevention of Sexual Harassment) అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుండి మహిళల రక్షణ. పోష్ చట్టం గురించి మహిళలు కచ్చితంగా తెలుసుకోవాలి. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోష్ చట్టం కింద వేధింపులు చేసే వారిని చట్ట ప్రకారం శిక్షించేలా చేయెుచ్చు.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి ఎవరు ఔను అన్నా.. కాదు అన్నా.. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు తరచుగా నమోదవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. అంటే కార్యాలయంలో లైంగిక వేధింపులు అనేది చిన్న విషయం కాదు. దానిని ఈజీగా తీసుకోకూడదు. వేధించే వ్యక్తి మీ యజమాని లేదా సహోద్యోగి కావచ్చు. చాలా మంది మహిళలు ఈ విషయంలో మౌనంగా ఉంటారు.

వేధింపుల గురించి చెబితే ఏం అవుతుందోనని అనుకుంటారు. ఇంట్లో సమస్యలు మెుదలవుతాయని భయపడతారు. అవసరమైతే ఉద్యోగం కూడా మానేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మీకు అన్యాయం జరిగినప్పుడు కచ్చితంగా పోరాడాలి. అలా చేయకుండా చాలామంది వేధింపులకు గురవుతున్నారు. కొందరికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. అందుకే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుండి మహిళలను రక్షించడానికి POSH అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ చట్టం వచ్చింది.

POSH చట్టం కార్యాలయంలో మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేయడానికి సహాయపడుతుంది. దీని గురించి తెలుసుకోవలసిన మహిళలు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి, భారతదేశంలో పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి ఈ చట్టం 2013లో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులైనా చేస్తే మహిళలు ఫిర్యాదు చేయెుచ్చు.

ఈ చట్టం అన్ని కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగులందరూ కార్యాలయంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని, కార్యాలయంలో ఎవరైనా మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తే, ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. కమిటీలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండాలి. పోష్‌లో అందిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవడం ఈ కమిటీ విధి.

ఈ చట్టం ప్రకారం, 90 రోజుల వరకు కార్యాలయంలో లేదా పోలీసు స్టేషన్‌లోని అంతర్గత కమిటీలో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. మీరు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. విషయం తీవ్రమైనది అయితే కార్యాలయ కమిటీ కూడా ఫైల్ చేస్తుంది. పోలీస్ స్టేషన్‌ వరకు ఫిర్యాదు వెళ్తుంది. కార్యాలయం అంతర్గత కమిటీ విచారణ నివేదికను 10 రోజుల్లోగా కంపెనీకి సమర్పించాలి. దోషిగా తేలితే కంపెనీ నిందితులను శిక్షిస్తుంది.

పని ప్రదేశంలో లైంగిక వేధింపులను ఈజీగా తీసుకోవద్దు. కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. ఈ చట్టం పరిధిలోకి కొన్ని విషయాలు వస్తాయి. శారీరక సంబంధం లేదా అనుచితంగా తాకడం, సంజ్ఞలు, ఎవరైనా శారీరకంగా అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం దీని కిందకు వస్తుంది. అంతేకాదు ఉద్యోగంలో ఏదైనా చేయాలంటే.. ఎలాంటి లైంగిక ప్రయోజనాల కోసం అడుగుతున్నారనేది కూడా ఇందులో ఉంటుంది. లైంగిక వ్యాఖ్యలు చేయడం, అశ్లీల కంటెంట్‌ను షేర్ చేయడం కూడా POSH చట్టం ప్రకారం నేరం.

చాలా కంపెనీలు POSH చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నాయి. వీడియోల రూపంలో కంటెంట్ ఉద్యోగులకు అందిస్తున్నాయి. ఎలాంటి పనులు చేయకూడదో చెబుతున్నాయి. మహిళలకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *