
Best Web Hosting Provider In India 2024

కుటుంబం బాగుండాలంటే ఇంటి యజమాని సరిగా ఉండాలని చాణక్య నీతిలో ఉంది. ఇంటి పెద్ద తీసుకునే నిర్ణయాలే కుటుంబం భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు నుంచి విలువల వరకూ వారు ఎలా ఉండారో దానిపైనే ఆధారపడి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు చాణక్యుడు. ఆయన కుటుంబ విలువల గురించి చాలా విషయాలు చెప్పాడు. చాణక్యుడు తన సూత్రాల ద్వారా ప్రజలను విజయపథంలో నడిపించాడు. చాణక్య నీతి ప్రస్తుత కాలంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. చాణక్యుడు ప్రకారం, కుటుంబం శ్రేయస్సు ఇంటి పెద్దపై ఆధారపడి ఉంటుంది. ఇంటి యజమాని తెలివైనవాడు అయితే అన్ని పరిస్థితులను నిర్వహించగలడు. అందుకే కుటుంబ పెద్దకు కొన్ని లక్షణాలు ఉండాలి.
ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంటి యజమానికి డబ్బు ఆదా చేసే గుణం కలిగి ఉండాలి. అప్పుడు కుటుంబానికి డబ్బుకు లోటు ఉండదు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎవరూ సహాయం అడగకుండా డబ్బు ఆదా చేయడం కుటుంబ పెద్దల బాధ్యత. అందుకే ఇంటి పెద్ద ఖర్చులను ఆచితూచి చేయించాలి. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. అది ఎంత వరకూ డబ్బు ఖర్చు చేయిస్తుందో లెక్కలు వేసుకోవాలి. ఇష్టం వచ్చిన విధంగా డబ్బు ఇవ్వకూడదు.
ఇంటి యజమాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి. ఇంట్లో క్రమమైన వాతావరణాన్ని నిర్వహించడానికి కుటుంబ పెద్ద తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ బాగుపడతారు. ఇంటి పెద్ద ఓ నిర్ణయం తీసుకుని ఫాలో అవ్వకుంటే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే వారు కఠిన నిర్ణయాలను కూడా ఫాలో అవుతూ ఉండాలి.
ఇంటి యజమాని రుజువు లేకుండా దేనినీ నమ్మకూడదు. అతను ఏదైనా వార్తను నమ్మే ముందు కచ్చితంగా ఉండాలి. ఏ కారణం చేతనైనా ఇంట్లో గొడవలు జరిగితే ఇరువర్గాల మాటలు విని అన్ని కోణాలను పరిశీలించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి వైపే స్టాండ్ తీసుకుని మాట్లాడితే.. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకరిని తిట్టినా.. తర్వాత సర్ది చెప్పే గుణం ఉండాలి.
చాణక్యుడు ప్రకారం, ఇంటి యజమాని కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎవరికీ నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడాలి. ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ చీలే అవకాశం ఉంది.
చాణక్య నీతి ప్రకారం, ఇంటిలోని ఆదాయానికి అనుగుణంగా ఇంటిని నిర్వహించడం ఇంటి పెద్దల బాధ్యత. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సి రావచ్చు. ఖర్చులను కచ్చితంగా నియంత్రించాలి. ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు ఈ విషయాన్నైతే కచ్చితంగా పాటించాలి. అవసరాలకు మించి ఖర్చులు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు.