Drama Juniors Season 7 Auditions: డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ షురూ.. పిల్లల వీడియోను ఎలా సెండ్ చేయాలంటే..

Best Web Hosting Provider In India 2024

Drama Juniors Season 7 Auditions: ప్రముఖ టీవీ ఛానెల్‍ జీ తెలుగులో ‘డ్రామా జూనియర్స్’ బాగా పాపులర్ అయింది. పిల్లలు తమ టాలెంట్లను ప్రదర్శించే ఈ షో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటి వరకు డ్రామా జూనియర్స్ 6 సీజన్లు జరిగాయి. త్వరలో 7వ సీజన్ కూడా మొదలుకానుంది. ఇందుకోసం జీ తెలుగు టాలెంట్ హంట్ మొదలుపెట్టింది. డ్రామా జూనియర్స్ 7వ సీజన్ కోసం ఆడిషన్లను ప్రారంభించింది. ఆ వివరాలను వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు

‘డ్రామా జూనియర్స్ సీజన్ 7’ ఆడిషన్లకు సంబంధించిన వివరాలు వెల్లయ్యాయి. 3 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. యాక్టింగ్, డ్యాన్స్, పాటలు పాడడం, మ్యాజిక్ ట్రిక్స్, మార్షల్ ఆర్ట్స్ సహా ఇతర టాలెంట్ ఉన్న పిల్లలు దీంట్లో పాల్గొనొచ్చు. అయితే, ఇందుకోసం ముందుగా ఆడిషన్ కోసం పిల్లల టాలెంట్ ప్రదర్శించే వీడియోను జీతెలుగుకు సెండ్ చేయాలి.

వీడియోను పంపడం ఇలా..

పిల్లల టాలెంట్ ఉండే వీడియోను జీ తెలుగుకు పంపాల్సి ఉంటుంది. వీడియో నిడివి 2 నిమిషాలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉండకూడదు. ఈ వీడియోను వాట్సాప్ ద్వారా అయితే 9100054301 నంబర్‌కు సెండ్ చేయాలి. DramaJuniorsS7Auditions.Zee5.com వెబ్ సైట్‍లో కూడా వీడియోలను అప్‍లోడ్ చేయవచ్చు. మెయిల్ ద్వారా వీడియోను సెండ్ చేయాలనుకుంటే.. dramajuniorsseason7@gmail.com ఈ-మెయిల్ ఐడీకి పంపించవచ్చు. ఈ వివరాలను జీ తెలుగు వెల్లడించింది.

వీడియో ఆడిషన్ల తర్వాత కొందరు పిల్లలను జీతెలుగు ఎంపిక చేయనుంది. ఆ తర్వాత నేరుగా ఆడిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అనంతరం షోకు ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక డ్రామా జూనియర్స్ 7వ సీజన్ మొదలుకానుంది. గత ఆరు సీజన్ల కంటే ఈసారి మరింత గ్రాండ్‍గా చేయాలని జీ తెలుగు ప్లాన్ చేసింది.

 

జీ తెలుగు ఛానెల్‍లో సీరియళ్ల విషయానికి వస్తే.. టీఆర్పీ రేటింగ్‍ల్లో త్రినయని, పడమటి సంధ్యా రాగం, ప్రేమ ఎంత మధురం టాప్‍లో కొనసాగుతున్నాయి. జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం సీరియళ్లు కూడా ఆదరణ దక్కించుకుంటున్నాయి. 

జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గత సంవత్సరం ఆగస్టులో మొదలైంది. ఈ సిరీయల్‍లో పల్లవి గౌడ, నిసర్గ గౌడ, రిచర్డ్ జోస్, మహేశ్వరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మేజర్ అమరేంద్ర వర్మ (రిచర్డ్).. భార్య అరుంధతి (పల్లవి) చనిపోయి ఆత్మలా మారి.. కుటుంబం చుట్టూనే తిరుగుతుంటుంది. అరుంధతి పిల్లలకు కేర్ టేకర్‌గా ఉండే భాగమతి (నిసర్గ)కి మాత్రమే కనిపిస్తుంటుంది. స్నేహితురాలిగా ఉంటూనే మనోహరి (మహేశ్వరి)నే భాగమతిని చంపించి ఉంటుంది. అమరేంద్రను వివాహం చేసుకోవాలని మనోహరి ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే, భాగమతి రాకతో ఆమెకు అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆత్మగా మారిన అరుంధతి.. కుటుంబం చుట్టూ తిరుగుతూ పిల్లలను కనిపెట్టుకొని ఉంటారు. ఇలా ఆసక్తికరంగా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సాగుతోంది. ఈ సిరీయల్ సోమవారం నుంచి శనివారం వరకు జీ తెలుగులో సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతోంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024