Brahmamudi Today Episode: రుద్రాణిని ముప్పుతిప్పలు పెట్టిన స్వప్న.. కల్యాణ్‌కు అనామిక వార్నింగ్.. రాజ్‌పై కావ్యకు డౌట్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial 299 Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తనకు రుద్రాణి సేవలు చేయాలని కుర్చీ తీసుకొచ్చి నెత్తిన పెట్టి మరి చెబుతుంది స్వప్న. దానికి స్వప్న అడిగిన దాంట్లో న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది. దాంతో చేసేది లేక అలాగే అని రుద్రాణి ఒప్పుకుంటుంది. ఆరోగ్యం బాలేకపోతే నీ కొడుక్కి చెప్పి హాస్పిటల్‌కు తీసుకెళ్లమనాలి అని స్వప్న అంటుంది. దాంతో పైకి వెళ్లిపోతుంది రుద్రాణి.

 

ట్రెండింగ్ వార్తలు

కొడుకు పనికి తప్పదుగా

కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న స్వప్న.. అత్తయ్య.. నాకు జ్యూస్ తీసుకురా అని అంటుంది. దాంతో కోపంగా వచ్చిన రుద్రాణి ఇప్పుడే చేస్తా అన్నాగా.. అప్పుడే చెబుతున్నావ్ అని అంటుంది. అందరిముందు ఒప్పుకున్నారు. తీసుకురావడానికి ఏంటి సమస్య అని స్వప్న అంటుంది. దాంతో తీసుకురా రుద్రాణి.. నీ కొడుకు చేసిన దానికి తప్పదుగా అని అపర్ణ అంటుంది. దాంతో రాహుల్‌ను కోపంగా చూస్తుంది రుద్రాణి.

అది చూసి ఫోన్ వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు రాహుల్. ఫోన్ రాలేదు కదా.. మరి అలా వెళ్లిపోయాడు అని ధాన్యలక్ష్మీ అంటే.. కొన్నిసార్లు ఫోన్ రావాల్సిన అవసరం లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు లాయర్‌తో ఆఫీస్‌లో మాట్లాడుతుంటాడు రాజ్. విడాకులకు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు అని రాజ్ అడిగితే.. ఒకటి ఒకరికి నచ్చకుంటే విడాకులు తీసుకుంటారు. ఇంకోటి ఇద్దరకీ నచ్చి తీసుకుంటారని లాయర్ చెబుతాడు.

తర్వాత కలుస్తారు

మాకు ఇద్దరికీ ఓకే. ఎలాంటి సమస్య లేదు. కారణాలు అంటే.. నచ్చలేదు.. విడాకులు తీసుకుంటున్నాం అని రాజ్ అంటాడు. మరోవైపు ఆయనేంటీ అలా అబద్ధం చెప్పారు. ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పేవారా, ఆ అమ్మాయి ఎవరు. అంత చనువుగా ఉన్నారు అని ఆటోలో వస్తూ ఆలోచిస్తుంటుంది కావ్య. అయితే, కొన్ని కేసుల్లో ముందు విడిపోతాం అంటారు. తర్వాత వద్దంటారు అని లాయర్ అంటే.. అలాంటిదేం జరగదు అని రాజ్ అంటాడు.

 

రాజ్ మనం తప్పు చేయట్లేదు కదా. ఓసారి ఆలోచించు అని శ్వేత అంటే.. నీకు తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుందా అని రాజ్ తిరిగి ప్రశ్నిస్తాడు. అది నీకే తెలియాలి అని శ్వేత అంటే.. ఇదే కరెక్ట్ సొల్యూషన్ అని రాజ్ అంటాడు. తర్వాత పేపర్స్ రెడీ చేయించి పంపిస్తానని లాయర్ చెప్పి వెళ్లిపోతాడు. లాయర్ వెళ్లడం కావ్య చూస్తుంది. రాజ్ గదికి వస్తుంది. అప్పుడు శ్వేత చేతిలో చేయి వేసి నువ్వేం కంగారు పడకు. నీకు అన్యాయం జరగనివ్వను. నేను చూసుకుంటాను కదా అని రాజ్ చెబుతుంటాడు.

చనువుగా ఉండటం చూసి

ఆ మాటలు విన్న కావ్య బయటకు వెళ్లి రిసెప్షన్ దగ్గర కూర్చుంటుంది. అటు నుంచి శ్వేత భుజాలపై చేయి వేస్తూ చనువుగా సంతోషంగా మాట్లాడుకుంటూ రాజ్ వస్తాడు. శ్వేతను పంపించిన తర్వాత కావ్యను చూసి షాక్ అవుతాడు. ఎప్పుడు వచ్చావని అడిగితే.. మీరు గమనించనలేనంత పనిలో ఉండటానికి ముందే. ఇక్కడికి వచ్చి ఎందుకు ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉన్నారో లేదా బయట ఉండి చెబుతున్నారో అనా అని కావ్య అంటుంది.

ఏయ్.. అవేం సమాధానాలు అని రాజ్ అంటే.. ఎందుకా ప్రశ్నలు. టిఫిన్ తీసుకొచ్చాను అని కావ్య అంటుంది. ఒక్కసారికి ఎందుకని రాజ్ అంటే.. మీకు బయట ఫుడ్ నచ్చదేమో అనుకున్నాను. కానీ ఈ మధ్య మీరు బయట రుచులకు అలవాటు పడ్డారని నాకేం తెలుసు అని కావ్య అంటుంది. మరోవైపు రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న అప్పుకు కల్యాణ్ కాల్ చేస్తాడు. కానీ, ధాన్యలక్ష్మీ అన్న మాటలు గుర్తుకువచ్చి లిఫ్ట్ చేయదు అప్పు.

 

తప్పు అన్నారుగా

ఎందుకు చేయట్లేదు అని కల్యాణ్ అనుకుంటుండగా.. అనామిక వచ్చి ఎవరికీ కాల్ చేస్తున్నారని అడుగుతుంది. అప్పుకి. కాల్ కట్ చేస్తుందని కల్యాణ్ అంటే.. దానర్థం అవాయిడ్ చేస్తుంది. ఇంట్లో అంతా పెద్ద గొడవ జరిగాక ఎందుకు మాట్లాడటం. మీరు ఫ్రెండ్స్ అయితే నాకు బాధ లేదు. కానీ, తన మనసులో మాట చెప్పింది కదా. ఇప్పుడు కూడా మాట్లాడితే ఎలా. ఇంట్లో వాళ్లు కూడా తప్పు అన్నారు కదా అని అనామిక అంటుంది. నాకు తప్పు అనిపించట్లేదు. అప్పు అలా అనుకోవడానికి నేనే కారణం అని కల్యాణ్ అంటాడు.

మీరు ఇప్పుడు కవి మాత్రమే కాదు. నాకు భర్త. నా భర్త నాకు మాత్రం సొంతం. ఇంకెవరితో మాట్లాడినా నాకు నచ్చదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అనామిక. మరోవైపు ఆటోలో రాజ్, శ్వేత గురించి ఆలోచిస్తుంది. ఇంతలో అప్పు అటోకు అడ్డుగా వస్తుంది. దాంతో ఆటో డ్రైవర్ తిడతాడు. అది చూసిన కావ్య అప్పుని పిలిచి.. ఏంటే ఆ పరధ్యానం.. దా ఇంటికి వెళ్దాం అని తీసుకెళ్తుంది కావ్య. ఇంట్లో అప్పు ప్రేమ గురించి మాట్లాడుకుంటారు.

లేట్‌ అయిందేంటీ

అంతా నావల్లే అని కనకం బాధపడుతుంది. తనను క్షమించమమని చేతులు ఎత్తి మొక్కుతుంది కనకం. దాంతో అయ్యో అమ్మా.. నువ్ మా బాగు కోసం చేశావ్. తప్పేముందు అని కావ్య నచ్చజెబుతుంది. అప్పుకు ఇలా పరధ్యానంగా ఉండకని హితవు చెబుతుంది. మరోవైపు అత్తా అంటూ రుద్రాణిని స్వప్న పిలిస్తే వస్తుంది. ఇంత లేట్‌గా రావడం ఏంటీ. త్వరగా రావొద్దా అని అరిచిన స్వప్న జ్యూస్ తీసుకురమ్మంటుంది.

 

పక్కనే ఉందిగా అని రుద్రాణి అంటే.. చేతికి ఎవరిస్తారు. మీ తాతా అని స్వప్న అంటుంది. దాంతో రుద్రాణి జ్యూస్ చేతికి ఇస్తుంది. తర్వాత గ్లాస్ తీసుకెళ్తుంది రుద్రాణి. అలా వెళ్లగానే మళ్లీ అత్త అని పిలుస్తుంది స్వప్న. దాంతో పరుగెత్తుకుంటూ వస్తుంద రుద్రాణి. ఎందుకంత ఫాస్ట్. నిదానంగా రావొచ్చు కదా అని స్వప్న అంటుంది. ఇందాకా అలా అన్నావని అంటే.. అదంతా నా ఇష్టం. నాకు నచ్చినట్లు అంటా అని స్వప్న అంటుంది.

రివర్స్ అవుతున్నాయి

ఆ ఏసీ ఆన్ చేసి వెళ్లు అంటే.. అక్కడే ఉన్న రిమోట్‌ను చూస్తుంది రుద్రాణి. చూసింది చాలు.. ఆన్ చేసి వెళ్లు అని స్వప్న అంటుంది. తర్వాత వెళ్లనా అని రుద్రాణి అంటే.. దిష్టిబొమ్మలా ఇక్కడే ఎందుకు.. వెళ్లు అని స్వప్న అంటుంది. దాంతో రుద్రాణి వెళ్తుంది. ఇంతలో రాహుల్ వస్తాడు. ముప్పుతిప్పలు పెడుతుంది. దీన్ని వదిలించుకోడానికి కొత్త ప్లాన్ ఉందని రుద్రాణి అంటే.. అమ్మా తల్లి నీ ప్లాన్స్ మనకే రివర్స్ అవుతున్నాయి ఏది వద్దు అని రాహుల్ అంటాడు.

ఇంతలో అత్తా వాటర్ అని స్వప్న పిలిస్తే.. నా రక్తం తాగవే అని వాటర్ తీసుకెళ్లి ఇస్తుంది రుద్రాణి. నీ కొడుకు ఏడి.. కనబడటం లేదు అని స్వప్న అంటే.. వాడు చచ్చి చాలా సేపు అయింది అని వెళ్లిపోతాడు రాహుల్. మరోవైపు కావ్యకు కనకం భోజనం తినిపిస్తుంది. ఇంతలో కృష్ణమూర్తి వస్తాడు. కావ్య వచ్చిందయ్యా అని కనకం చెబితే.. కనపడుతోంది. మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మా అని కృష్ణమూర్తి అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024