Best Web Hosting Provider In India 2024

ఎవరినైనా.. బంగారం కంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏది అని అడిగితే ఆ వస్తువు పేరు మనకు గుర్తుకు రాదు. మనకు తెలిసినంత వరకూ బంగారమే మనకు విలువైనది. మధ్యతరగతి వారికి ఎంత బంగారం కొంటే అంత గొప్ప. కానీ కొన్ని వస్తువులు బంగారం కంటే ఖరీదైనవి కూడా ఉంటాయి. వాటి విలువ ఎక్కువ. కానీ వాటి గురించి పెద్దగా తెలియదు. కానీ మనం సాధారణంగా చూసే విషయానికి విలువ ఎక్కువ ఉంటే కాస్త ఆశ్చర్యమేస్తుంది. అలానే కొన్ని ప్రమాదకరమైన పదార్థాలు ఎల్లప్పుడూ ఖరీదైనవి. అందులో ఒకటి విషం. అవును మీరు చదివింది నిజమే.
ట్రెండింగ్ వార్తలు
నిజానికి విషం అనగానే మనందరికీ మెుదట గుర్తు వచ్చేది పాములు. అయితే పాముల మాదిరిగానే తేలు విషం కూడా ప్రమాదకరం. ఈ తేలు విషాన్ని ఈజీగా తీసిపడేయెుద్దు. దీని విలువ మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన తేలు విషం ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం. ఎందుకంటే దీని వల్ల చంపడమే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ విషానికి బంగారం కంటే ఎక్కువ విలువ ఉంది.
సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రజలు ఈ తేలు విషం కోసం వెతుకుతూ ఉంటారు. మన దగ్గర రంగు రాళ్లు, లంకె బిందెల కోసం వెతుకుతున్నట్టుగా అన్నమాట. కానీ ఆ తేలు విషం తీసుకురావడం అంత సులభం కాదు. ఒకసారి ఈ తేలు కుట్టిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో చనిపోతాడు. తేలు చూసేందుకు చిన్న జీవులు కావచ్చు, కానీ మీరు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఆ తేలు ఏదో కాదు.. డెత్‌స్టాకర్. దీని విషం చాలా లాభదాయకం. ఈ తేలు లీటర్ విషం ధర దాదాపు రూ.84 కోట్లు. డెత్‌స్టాకర్ విషం ఒక చుక్క ధర 11,000 రూపాయలు. ఒక తేలు ఒకేసారి రెండు మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే వస్తుంది. పెద్ద పరిమాణంలో విక్రయించలేరు.
ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని ఎడారులు, స్క్రబ్ జంగిల్స్‌లో డెత్‌స్టాకర్ ఉంటాయి. ఈ తేలు కుడితే మెుదట స్పర్శ పోతుంది. తర్వాత ప్రాణాలకు ఇబ్బంది. దీని ద్వారా ప్రాణాలను కూడా రక్షించవచ్చు. అందుకే దీనికంతటి విలువ.
డెత్‌స్టాకర్ విషం లోపల క్లోరోటాక్సిన్ అనే పెప్టైడ్ ఉంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. అనేక వైద్యపరమైన పురోగతిలో వాడుతారు. ఈ విషం మెదడు కణితులకు చికిత్స చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. మధుమేహం చికిత్సలో కూడా విషాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే ఈ తేలు విషానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అధిక డిమాండ్ కారణంగా డెత్ స్టాకర్ స్మగ్లింగ్, విషం కోసం వేట, వాటిని చంపడం కూడా పెరిగింది. మెుత్తానికి ఈ తేలు విషం బంగారం కంటే ఎక్కువగా ఉంది.