Oppenheimer OTT Telugu: ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన 7 ఆస్కార్ల సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

Best Web Hosting Provider In India 2024

Oppenheimer OTT Telugu: హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‍హైమర్’ ఆస్కార్ 2024 అవార్డుల్లో సత్తాచాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తంగా ఈ మూవీకి ఏడు ఆస్కార్ అవార్డులు దక్కాయి. మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ హిట్ అయింది. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ చిత్రం రూపొందింది. ఇప్పుడు, ఈ ఓపెన్‍హైమర్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ఏ ప్లాట్‍ఫామ్‍లో..

ఈనెల జరిగిన ఆస్కార్ వేడుకలో ఓపెన్‍హైమర్ చిత్రం ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై మరోసారి అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ తరుణంలో మార్చి 21వ తేదీన ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ముందుగా ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ భాషల్లో అడుగుపెట్టింది. అయితే, నేడు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల వెర్షన్‍లలోనూ ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఒరిజినల్ ఇంగ్లిష్ సహా హిందీ, తెలుగుతో పాటు మరో 5 భారతీయ భాషల్లో ఓపెన్‍హైమర్ మూవీ జియోసినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఈ మాస్టర్ పీస్ మూవీ మరింత ఎక్కువ మందికి రీచ్ కానుంది. జియోసినిమా ప్రీమియం సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.

ఓపెన్‍హైమర్ చిత్రం సినిమాటిక్ అద్భుతమని డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్‍పై మరోసారి ప్రశంసలు వచ్చాయి. ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జే రాబర్ట్ ఓపెన్‍హైమర్ అనే బుక్ ఆధారంగా ఈ మూవీని తెరక్కించారు. ఈ చిత్రంలో రాబర్ట్ ఓపెన్‍హైమర్‌ పాత్రను కిల్లాన్ మర్ఫీ పోషించారు. అణుబాంబు సృష్టికర్త జీవితకథను ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలో ఎమిలీ బ్లంట్, మాయ్ డామోన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోస్ హార్ట్‌నెట్ కీలకపాత్రలు పోషించారు.

ఓపెన్‍హైమర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ బ్లాక్‍ బస్టర్ అయింది. సుమారు 100 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుమారు 964 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కాయి. భారీ హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని ఎమ్మా థామస్, చార్లెస్ రోవాన్, క్రిస్టోఫర్ నోలాన్ నిర్మించారు. హౌటే వాన్ హౌటెమా సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రాన్ని మరో హైలైట్‍గా నిలిచింది.

ఓపెన్‍హైమర్‌కు ఆస్కార్లు

ఓపెన్‍హైమర్ చిత్రం 96వ అకాడమీ అవార్డుల్లో సత్తాచాటింది. ఆస్కార్స్ 2024లో ఏడు అవార్డులు దక్కాయి. ఈ మూవీకి ఉత్తమ చిత్రం పురస్కారం దక్కింది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలాన్‍ను అవార్డు వరించింది. నోలాన్‍కు ఇదే తొలి ఆస్కార్. అలాగే, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీకి కూడా ఆస్కార్ దక్కింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (డౌనీ జూనియర్), బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (జెన్నీఫర్ లేమ్), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (లడ్విగ్ గోరన్‍సన్), బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లోనూ ఈ చిత్రానికి అవార్డులు లభించాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024