Vangibath Powder: వాంగీ బాత్ పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయ రైస్ చేసేసుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024

Vangibath Powder వంకాయ రైస్‌ను వాంగీబాత్ అని పిలుస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు… ఏవైనా కూడా వాంగీబాత్ రైస్ చేస్తే రుచిగానే ఉంటాయి. ఈ రైస్ చేయడానికి ముందుగా ఒక మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇది రెడీమేడ్ గా మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఇంట్లో చేసుకుంటే చాలా స్వచ్ఛంగా, శుచిగా వస్తుంది.

వాంగీబాత్ పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

శనగపప్పు – ఒక స్పూను

మినప్పప్పు – ఒక స్పూను

ఎండుమిర్చి – ఐదు

మెంతులు – పావు స్పూను

ధనియాలు – ఒక స్పూను

దాల్చిన చెక్క – చిన్న ముక్క

గసగసాలు – అర స్పూను

ఎండు కొబ్బరి పొడి – ఒక స్పూను

యాలకులు – మూడు

లవంగాలు – మూడు

వాంగీ బాత్ పొడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి.

2. ఇవి కాస్త వేగాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి.

3. ఆ తర్వాత గసగసాలు వేయాలి. ఇవన్నీ వేగాక స్టవ్ కట్టేయాలి.

4. మిక్సీ జార్ లో వీటన్నింటినీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి.

5. అంతే వాంగిబాత్ పౌడర్ రెడీ అయినట్టే. ఒక సీసాలో గాలి చొరబడకుండా ఈ పొడిని వేసి మూత పెట్టాలి. వంకాయ రైస్ చేసుకునేటప్పుడు పొడిని చల్లుకుంటే సరిపోతుంది.

వాంగీ బాత్ రైస్ చేసుకోవడం చాలా సులువు. వంకాయలను నిలువుగా కోసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. అలాగే కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఆ మిశ్రమంలో రెండు పచ్చిమిర్చిలను నిలువుగా వేసి వేయించుకోవాలి. అందులోనే నిలువుగా కోసిన వంకాయ ముక్కలను వేసి బాగా ఉడికేలా చూసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వండిన అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి. అన్నమంతా కలిశాక చివర్లో ఈ వాంగీబాత్ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే… వాంగీ బాత్ రెడీ అయినట్టే. అవసరమైతే పసుపును కూడా వేసుకోవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఇలా వాంగిబాత్ పౌడర్‌ను రెడీగా ఇంట్లో ఉంచుకుంటే లంచ్, డిన్నర్ లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ స్టెంట్‌గా మిగిలిపోయిన అన్నంతో వంకాయ రైస్ చేసే చేసుకోవచ్చు.

సమయం తక్కువగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో ఈ వాంగిబాత్ రెడీ అయిపోతుంది. కాబట్టి ఇలా పొడి చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. అన్నం మిగిలిపోయిన సందర్భాల్లో నిమ్మకాయ పులిహోర చేసినట్టే ఈ వాంగిబాత్‌ను కూడా సులువుగా చేసేయొచ్చు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024