Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నగదు అందించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో నిర్వహిస్తున్న యాత్ర సందర్భంగా నగదు అందించడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ అధికారులు స్పందించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20 వ తేదీన నారా భువనేశ్వరీ ఎన్నికల నిబందనలు ఉల్లంఘించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఈ నెల 21 వ తేదీన ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.