Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడం తప్ప బాబుకు వేరే దారిలేదు
నెల్లూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల తరువాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు అలాంటివి నమ్మాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం మొదలు పెట్టాయని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వారే బెట్టింగ్ కు నిధులు ఇస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రజల గుండెల్లో వైయస్ఆర్ సీపీ ఉంది.. ఐదు సంవత్సరాలలో వైయస్ జగన్ వారి మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు.
లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు.. ఇక టీడీపీ అనేది ఉండదని విజయసాయిరెడ్డి విమర్శించారు. బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా.. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిందేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందంటే.. బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి వేరే దారిలేదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో మంచి సంబంధాలు మాత్రమే కొనసాగించాం.. అప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నెల్లూరు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం.. నెల్లూరు టౌన్ విషయంలో ఛాలెంజ్ జరుగుతోంది.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా వైయస్ఆర్ సీపీనే గెలుస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు.
వేమిరెడ్డి నిత్య పెళ్లికొడుకు: ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ సాయి రెడ్డి గెలిస్తే నెల్లూరులో ఉండడని వేమిరెడ్డి అన్నారని.. ఈయన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. వైయస్ఆర్ కుటుంబానికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు.. కుటుంబ సభ్యుడు అని చెప్పారు. నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటికీ ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా వేమిరెడ్డి గురించి చెబుతారు.. రాజకీయ బిక్ష పెట్టిన వైయస్ జగన్ కు వెన్నుపోటు పొడిచి పొగరుతో అహంకారంతో బయటికి వెళ్లారని చెబుతారన్నారు. ఒకప్పుడు నెట్టేసిన చంద్రబాబు దగ్గరికి చేరారు. ఎమ్మెల్యే, మంత్రి కావాలనే ప్రశాంతి రెడ్డి కోరిక కలగానే మిగిలిపోతుందని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.