Janasena Candidates : పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ స్థానాలు జనసేనకే- అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్

Best Web Hosting Provider In India 2024

Janasena Candidates : జనసేన పార్టీ మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను(Janasena Candidates) ఖరారు చేసింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించారు. ఈ సీట్లలో విడతల వారీగా జనసేన అభ్యర్థులను ఖరారు చేస్తుంది. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం(P Gannavaram), ఏలూరు జిల్లాలోని పోలవరం(Polavarama) అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించారు. ఈ రెండు స్థానాలు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. పి.గన్నవరం నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అందించారు. పి.గన్నవరం నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్… స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ల దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారన్నారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కోరారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే, గెలుపు మనదే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణకు టికెట్

శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “పి.గన్నవరం నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి ఇన్ ఛార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారు. పార్టీ విధివిధానాలను అనుసరించారు. ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దిశదశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే” అని అన్నారు. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గిడ్డి సత్యనారాయణ(Giddi Satyanarayana)కు ఎన్నికల నియమావళి, నిబంధనల పత్రాలను అందచేశారు.

మహాసేన రాజేష్ తప్పుకోవడంతో

అయితే పి.గన్నవరం టికెట్ ముందు టీడీపీకి కేటాయించారు. టీడీపీ మహాసేన రాజేష్(Mahasena Rajesh) కు సీటు ఇచ్చింది. గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, టీడీపీ, జనసేన నేతలను నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ సీటును తాజాగా జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పని చేశారు. రెండు నెలల క్రితమే ఆయన జనసేన(Janasena)లో చేరారు.

పోలవరం నుంచి చిర్రి బాలరాజు పోటీ

ఏలూరు జిల్లా పోలవరం (Polavaram)నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నేత చిర్రి బాలరాజు(Chirri Balaraju) పేరు ఖరారైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు బాలరాజుకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పనిచేసి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మొత్తం 6 అసెంబ్లీ స్థానాల్లో చేస్తుంది.

  • భీమవరం – పులవర్తి రామాంజనేయులు
  • తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
  • నర్సాపురం – బొమ్మిడి నాయకర్
  • ఉంగుటూరు – పట్సమట్ల ధర్మరాజు
  • పోలవరం – చిర్రి బాలరాజు
  • నిడదవోలు – కందుల దుర్గేష్

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh Assembly Elections 2024Andhra Pradesh NewsJanasenaJanasena CandidatesWest GodavariAp Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024