Vijay Deverkonda in TV Shows: రెండు టీవీ ఛానెళ్ల స్పెషల్ ప్రోగ్రామ్‍ల్లో విజయ్ దేవరకొండ.. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలు

Best Web Hosting Provider In India 2024

Vijay Deverkonda in TV Shows: ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతగోవిందం తర్వాత విజయ్ – పరశురామ్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. పాటలు, ట్రైలర్‌తో ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అలాగే, ప్రమోషన్లను కూడా జోరుగా చేస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. ఉగాది సందర్భంగా రానున్న రెండు స్పెషల్ టీవీ షోల్లో వారిద్దరూ సందడి చేశారు. ఆ టీవీ షోలు, టెలికాస్ట్ టైమింగ్స్ వివరాలు ఇవే..

ఈసారి పండుగ మనదే..

ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీ ఛానెల్‍లో ‘ఈసారి పండుగ మనదే’ షో ప్రసారం కానుంది. ఈ ఈవెంట్‍కు సుధీర్ యాంకర్‌గా ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ కోసం ఈ ఈవెంట్‍కు హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజు వెళ్లారు. ఈ స్పెషల్ షోకు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది.

తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండ అంటూ విజయ్ దేవరకొండకు వెల్‍కమ్ చెప్పారు సుధీర్. వాట్సాప్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ తన ఐకానిక్ డైలాగ్ చెప్పారు విజయ్. ఈ ఈవెంట్‍లో మృణాల్ ఠాకూర్‌తో కలిసి విజయ్ డ్యాన్స్ చేశారు. దిల్‍రాజు కూడా స్టెప్ వేశారు.

ఉగాది రోజున ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఈటీవీ ఛానెల్‍లో ‘ఈసారి పండగ మనదే’ స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. బలగం డైరెక్టర్, ఒకప్పటి జబర్దస్క్ కమెడియన్ వేణు ఎల్దండి కూడా ఫ్యామిలీతో ఈ ఈవెంట్‍లో కనిపించనున్నారు.

ఉగాది ఉమ్మడి కుటుంబం ప్రోగ్రామ్

‘ఫ్యామిలీ స్టార్‌తో ఉగాది ఉమ్మడి కుటుంబం’ పేరుతో జీ తెలుగు ఛానెల్‍లో స్పెషల్ ఈవెంట్ వస్తోంది. ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చేసింది.

ఈ ప్రోగ్రామ్‍కు హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్‍రాజు హాజరయ్యారు. నందనందనా పాట హుక్ స్టెప్‍ వేశారు విజయ్. సీరియల్ నటీమణులతోనూ డ్యాన్స్ చేశారు. పిల్లలతోనూ సందడి చేశారు.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో గోవర్దన్ అనే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇందు పాత్ర చేశారు మృణాల్ ఠాకూర్. ట్రైలర్, పాటల్లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా కనిపించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు.

ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం ప్రీ రిలీజ్ ప్రెస్‍మీట్‍ను కూడా మూవీ టీమ్ నేడు నిర్వహించింది. ఈ ఈవెంట్‍లో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు విజయ్. మృణాల్ ఠాకూర్, దిల్‍రాజు కూడా ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చెన్నైలోనూ ఇటీవల ప్రమోషన్లు చేసింది మూవీ టీమ్.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024