Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Best Web Hosting Provider In India 2024

Bharti Singh Hospitalised: తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ భారతీ సింగ్ హాస్పిటల్లో చేరింది. కొన్ని రోజులుగా తాను కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో వెల్లడించింది. గాల్‌బ్లాడర్లో రాళ్లను తొలగించడానికి డాక్టర్లు ఆమెకు సర్జరీ చేయనున్నారు. నొప్పి భరించలేక ఏడుస్తూ ఆమె ఈ వీడియో చేసింది.

భారతీ సింగ్ హెల్త్ అప్డేట్

హాస్పిటల్ బెడ్ పై నుంచే కమెడియన్ భారతీ సింగ్ ఈ వీడియో చేసింది. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్లో ఆమె చేరింది. కొన్ని రోజులుగా తాను ఎంతలా కడుపు నొప్పితో బాధపడుతున్నానో ఆ వీడియోలో ఆమె వివరించింది. మొదట్లో తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే నొప్పి భరించలేనంతగా పెరిగిపోయినట్లు భారతీ తెలిపింది.

ఆ తర్వాత హాస్పిట్లో చేరిన ఆమెకు టెస్టులు నిర్వహించడంతో గాల్‌బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వాటిని సర్జరీ చేసి తొలగించాలని నిర్ణయించారు. హాస్పిటల్లో తనను జాగ్రత్తగా చూసుకుంటున్న సిబ్బందికి ఈ వీడియో ద్వారా ఆమె థ్యాంక్స్ చెప్పింది. దీని కారణంగా తాను తన కొడుకు గోలాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పి భారతీ ఎమోషనల్ అయింది.

“ఏ తల్లి ఇలా తన చిన్నారిని వదిలి ఇలా హాస్పిటల్లో ఉండకూడదు. నా కొడుకు ఆడుకుంటున్నాడని హర్ష్ చెప్పాడు. ఒకవేళ నేనెక్కడ అని అడిగితే షూటింగ్ కు వెళ్లినట్లు చెబుతానన్నాడు. కొన్ని రోజుల్లో కోలుకుంటాను” అని భారతీ ఆ వీడియోలో చెప్పింది.

ఎవరీ భారతీ సింగ్?

భారతీ సింగ్ ఓ కమెడియన్. ఆమె టీవీ షోల ద్వారా పాపులర్ అయింది. ఎన్నో కామెడీ షోలతోపాటు అవార్డుల షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. ఆమె మరో కమెడియన్ హర్ష్ ను పెళ్లి చేసుకుంది. 2016 నుంచి ఆమె ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదిస్తూనే ఉంది.

స్టార్ వన్ లో వచ్చే గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ షోలో రన్నరప్ గా నిలవడం ద్వారా భారతీ సింగ్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కామెడీ సర్కస్ లో ఓ కంటెస్టెంట్ గా పోటీ చేసింది. ఆ షో ద్వారానే ఆమె పేరు సంపాదించింది. ఆ తర్వాత ఆమె ఎన్నో షోలను హోస్ట్ చేసింది. 2017లో హర్ష్ ను ఆమె పెళ్లి చేసుకుంది. కమెడియన్ గానే కాదు జాతీయ స్థాయిలో ఆర్చరీ, షూటింగ్ లలోనూ భారతీ సింగ్ రాణించింది.

గతేడాది రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలో నటించింది. లోల్ పాడ్‌కాస్ట్, డ్యాన్స్ దీవానే లాంటి షోలను ప్రస్తుతం భారతీ హోస్ట్ చేస్తోంది. అయితే ఈ సర్జరీ కారణంగా షూటింగ్ ల నుంచి ఆమె బ్రేక్ తీసుకుంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024