Best Web Hosting Provider In India 2024
AP POLYCET Results 2024 : ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం రిజల్ట్స్ ను విడుదల చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఈ ఫలితాలను https://polycetap.nic.in/apssprc.aspx లింక్ తో చెక్ చేసుకోవచ్చు.
ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్షలు మొత్తం 1.42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 1.24లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి పరీక్షలో బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారని ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు.
How to view the AP POLYCET 2024 Result – ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ పాలిసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు https://apsbtet.ap.gov.in లేదా https://polycetap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ‘AP POLYCET 2024 Result’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
టాపిక్
Ap Polycet