
Best Web Hosting Provider In India 2024

Heroine Laya About Director Harassment: బ్యూటిఫుల్ హీరోయిన్ లయకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది ఈ భామ. అంతేకాకుండా యూత్‌లో కూడా లయకు సూపర్ క్రేజ్ ఉండేది.
అమ్మ వారి పాత్రలో
స్వయంవరం సినిమా తర్వాత మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ, బాలకృష్ణ విజయేంద్ర వర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి ఇతర సినిమాలతో ప్రేక్షకుల అలరించింది. ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోయి యాక్ట్ చేసే లయకు అభిమానులు భారీగానే ఉండేవారు. లయ చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. అనంతరం సినిమాలు చేయలేదు.
అమెరికాలో సెటిల్
లయ సినీ ఇండస్ట్రీకి దూరమై సుమారుగా 18 సంవత్సరాలు అవుతోంది. సినిమాల తర్వాత అమెరికాలో సెటిల్ అయింది లయ. అక్కడ నాలుగేళ్లపాటు ఉన్న లయ తర్వాత ఐటీ ఉద్యోగం చేసింది. కొన్నాళ్లకు అది కూడా వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కరోనా తర్వాత డ్యాన్స్ స్కూల్ సైతం మానేసి సోషల్ మీడియాలో డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంది.
టాలీవుడ్‌కు రీ ఎంట్రీ
ఇప్పుడు త్వరలో టాలీవుడ్‌కు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది లయ. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది లయ. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, వేధింపులపై చెప్పుకొచ్చింది.
గుర్తుకు వస్తే బాధేస్తుంది
“నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. నేను రోడ్డున పడ్డానని, అడుక్కు తింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు, పుకార్లు సృష్టించారు. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికిక ప్రధాన కారణం సినిమా. నేను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను” అని లయ తెలిపింది.
ఎలా వెళ్తారో అని
“నితిన్ తమ్ముడు సినిమాలో నటిస్తున్నాను” అని లయ తన రీ ఎంట్రీ గురించి చెప్పింది. అలాగే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది. “ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేట ఎయిర్ పోర్టులో కారు పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు” అని లయ చెప్పుకొచ్చింది.
చంపేయమన్నాను
“నేను ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ, ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ కూడా వచ్చాడు. మీరు చంపుతానని అన్న నేనేం చేయలేను. ఇక్కడ ఎవరూ లేరు. మీ ఇష్టం చంపేయండని అన్నాను” అని అప్పటి తన ఇబ్బందికర పరిస్థితి గురించి, వేధింపుల గురించి తెలిపింది. అయితే సుమారు 18 ఏళ్ల తర్వాత ఈ నిజం బయటపెట్టిన లయ ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు.
శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు
కాగా లయ చాలా కాలం తర్వాత నితిన్ తమ్ముడు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో బస్సుపై కూర్చుని త్రిశూలం పట్టుకుని ఉన్నాడు నితిన్. బస్సు లోపల లయ కూర్చుని ఉంది. లయ తీక్షణంగా చూస్తూ ఉండటం మనం చూడొచ్చు. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.