Yatra 2 OTT: మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన యాత్ర 2 సినిమా

Best Web Hosting Provider In India 2024

Yatra 2 OTT: యాత్ర 2 చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వీ రాఘవ్ తెరక్కించారు. ఎన్నికల ఏడాది వచ్చిన ఈ చిత్రం పొలిటికల్ హీట్ కూడా పెంచింది. 2019లో వచ్చిన యాత్రకు సీక్వెల్‍గా సరిగ్గా ఐదేళ్లకు ‘యాత్ర 2’ చిత్రాన్ని తీసుకొచ్చారు డైరెక్టర్ మహి. ఈ చిత్రం ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, నేడు (జూన్ 3) మరో ప్లాట్‍ఫామ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది.

 

మరో ఓటీటీలో..

యాత్ర 2 సినిమా నేడు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు ప్రచారం లేకుండానే సడెన్‍గా ఈ మూవీని అందుబాటులోకి తెచ్చింది ఆహా. “మేం న్నాం. మేం విన్నాం. యాత్ర 2 మీ కోసం తీసుకొస్తున్నాం!” అని ట్వీట్ చేసింది ఆహా. యాత్ర 2ను స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చినట్టు (జూన్ 3) వెల్లడించింది.

దీంతో యాత్ర 2 మూవీ ప్రస్తుతం రెండో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ ఈ మూవీని చూసేయవచ్చు.

యాత్ర 2 చిత్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషించగా.. వైఎస్ జగన్ క్యారెక్టర్‌ను తమిళ నటుడు జీవా చేశారు. వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ నటించారు. సుజానే బెర్నెర్ట్, మహేశ్ మంజ్రేకర్, అశ్రిత కీలకపాత్రలు పోషించారు.

వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు, వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర, 2019లో ముఖ్యమంత్రి అవడం ప్రధాన అంశంగా యాత్ర 2 చిత్రాన్ని దర్శకుడు మహీ వి రాఘవ్ తెరకెక్కించారు. యాత్ర 2 ఫిబ్రవరి 8న థియేటర్లలో రాగా.. మంచి టాకే వచ్చింది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు.

 

యాత్ర 2 చిత్రాన్ని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అంచిందిన ఈ మూవీకి మధి సినిమాటోగ్రఫీ చేశారు.

ఆహాలో ప్రసన్నవదనం జోరు

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ప్రసన్నవదనం సినిమా ప్రస్తుతం దుమ్మురేపుతోంది. సుహాస్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలోకి 9 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి ఈ చిత్రం సత్తాచాటింది. ప్రసన్నవదనం మూవీ మే 3వ తేదీన థియేటర్లలో రిలీజై మోస్తరు హిట్ అయింది. మే 24వ తేదీన ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.

ఫేస్ బ్లైండ్‍నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆధారంగా థ్రిల్లర్‌గా ప్రసన్నవదనం మూవీని తెరకెక్కించారు దర్శకుడు అర్జున్ వైకే. ఈ మూవీలో సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‍గా నటించారు. రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు చేశారు. ప్రసన్నవదనం మూవీని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ నిర్మించింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. కాగా, సుహాస్ హీరోగా నటించిన శ్రీరంగనీతులు కూడా గత వారం ఆహా ఓటీటీలోకి వచ్చింది.

IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024