NNS June 8th Episode: అమర్ ఇంటికి రామ్మూర్తి.. మాట తప్పనన్న శివరామ్- భర్త రొమాన్స్ గురించి అరుంధతికి చెప్పిన భాగీ

Best Web Hosting Provider In India 2024


Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 8th June Episode) పిల్లలు ఫాదర్స్​ డే సెలబ్రేషన్స్​కి ఇంటిని బాగా అలంకరిస్తారు. కిటికీలో నుంచి గుప్తతోపాటు ఇంట్లో జరుగుతున్న సంబరాలు చూస్తూ గతంలో తాను జరిపిన ఫాదర్స్​ డేని గుర్తు చేసుకుంటుంది అరుంధతి. పిల్లలు ఒక్కొక్కరు అమర్​కి తమ గిఫ్ట్​లు ఇస్తారు.

 

పెయింటింగ్ చూస్తే

అంజు గీసిన పెయింటింగ్​ని మిస్సమ్మ చూడకుండా జాగ్రత్తపడతారు. అరుంధతి, గుప్త అంజు గీసిన పెయింటింగ్​ చూసి ఆశ్చర్యపోతారు. మిస్సమ్మ ఆ పెయింటింగ్​ చూస్తే ఆమెకి నిజం తెలిసిపోతుందని అరుంధతిని హెచ్చరిస్తాడు గుప్త. ఎంత ప్రయత్నించినా మిస్సమ్మ మాత్రం ఆ పెయింటింగ్​ని చూడలేకపోతుంది. అమర్​ ఆ పెయింటింగ్​ చూసి ఎమోషనల్​ అవుతాడు.

 

అలా అమర్​ని చూసి బాధగా ఆ పెయింటింగ్​లో ఏముందా అని చూడాలనుకుంటుంది మిస్సమ్మ. అమర్​ విసురుగా ఆ పెయింటింగ్​ని తీసుకుని వెళ్తాడు. మిస్సమ్మా.. ఈ ఇంటి కోడలు అంటే అలా పక్కన ఉండటం కాదు పిల్లలతో కలిసిపోయి సంబురాల్లో పాలుపంచుకోవాలి అంటాడు శివరామ్​. ఏం చెప్పారు సార్ అంటాడు రాథోడ్​. కోపంగా చూస్తాడు అమర్. పిల్లలు కూడా రాథోడ్​ వంక చిరాగ్గా చూస్తారు.

 

అమ్మాయి లేదని మాట తప్పలేను

హాల్లో జరుగుతున్నదంతా చూసి గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది మనోహరి. అమర్​ లోపలకు వెళ్లి మందు బాటిల్​ తెచ్చి శివరామ్​కి ఇచ్చి ఫాదర్స్​ డే విషెస్​ చెబుతాడు. సారీ అమర్​, కోడలు పిల్లలకి తాగనని మాటిచ్చాను. అమ్మాయి లేదని మాట తప్పలేను అంటాడు శివరామ్​. అందరూ బాధగా చూస్తారు. తాగకపోయినా దీన్ని గుర్తుగా నాదగ్గరే ఉంచుకుంటాను అంటాడు శివరామ్.

 

మిస్సమ్మను అరుంధతి పిలవడంతో మాట్లాడటానికి బయటకు వస్తుంది. ఎందుకు పిలిచారు అక్క అని అడుగుతుంది మిస్సమ్మ. ఏం చెప్పాలో అర్థంకాక తడబడుతుంది అరుంధతి. ఏం చెప్పి సమాధాన పరుస్తావో అంటూ గుప్త అరుంధతిని ఆటపట్టిస్తాడు. మీరు ఊరుకోండి అంటుంది అరుంధతి. ఎవరితో మాట్లాడుతున్నావ్​ అక్కా అడుగుతుంది మిస్సమ్మ. ఏం చెప్పాలో అర్థంకాక నీ చీర బాగుంది మిస్సమ్మ.. అది చెప్పుదామనే పిలిచా అంటుంది అరుంధతి.

 

అలాంటి వారు కాదు

ఏమో అక్కా.. భార్యాభర్తల మధ్య జరిగేవి ఎవరికీ చెప్పుకోవద్దని ఆగుతున్నాగానీ, నీతో ఓ విషయం పంచుకోవాలని ఉంది అంటుంది మిస్సమ్మ. ఏదో జరిగినట్లుంది అంటాడు గుప్త. అదేం అయ్యుండదు.. మీరు ఆగండి అంటూ అసలేం జరిగిందో చెప్పు మిస్సమ్మ అంటుంది అరుంధతి. తనకి, అమర్​కి మధ్య జరిగిందంతా చెబుతుంది మిస్సమ్మ.

 

నో.. ఆయన అలాంటివారు కాదు. ఎప్పుడూ అలాంటి పనులు చేయరు అంటుంది అరుంధతి. అదేంటక్కా.. ఆయనేదో మీ ఆయన అన్నట్లు అంతగా కంగారు పడుతున్నారు అంటుంది మిస్సమ్మ. అదేం కాదు మిస్సమ్మ.. ఆయన మిలిట్రీ కదా.. అందుకని అలా అన్నాను అని కవర్​ చేస్తుంది అరుంధతి.

 

ఏమో అక్కా.. ఈ మనోహరి గోల లేకపోతే నాన్న దగ్గరకు వెళ్లి విష్ చేసేదాన్ని అంటుంది భాగీ. అంతలోనే గేట్‌‌లో నుంచి రామ్మూర్తి, మంగళ ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్లని చూసి ఆనందంగా పరిగెత్తుకెళ్లి తండ్రిని కౌగిలించుకుంటుంది భాగీ.

 

నోరు అదుపులో పెట్టుకోవాలి

అబ్బో.. రెండు రోజులకే ఎంత బెంగో అంటూ మూతి తిప్పుతుంది మంగళ. కుట్రలు, కుళ్లు మాత్రమే తెలిసిన నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుందే అంటాడు రామ్మూర్తి. ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావమ్మా అంటాడు. అక్కతో మాట్లాడుతున్నా నాన్న.. అంటూ అరుంధతి కోసం వెతుకుతుంది. ఈమేంటీ.. ఎవరికైనా పరిచయం చేద్దామంటే కనపడకుండా మాయమవుతుంది అంటుంది భాగీ.

 

అంటే అరుంధతి ఆత్మ ఇక్కడే ఉందన్నమాట, నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది అనుకుంటుంది మంగళ. భాగీ అక్కా అని పిలిచేది అరుంధతి ఆత్మనే అని అందరికీ తెలుస్తుందా? అంజు గీసిన బొమ్మని భాగీ చూస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జూన్​ 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024