Cooking Oil and Gas Stove : గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెట్టే అలవాటు ఉంటే మానేయండి.. ఈ తప్పు చేయెుద్దు

Best Web Hosting Provider In India 2024

వందలో తొంభై మంది ఇళ్లలో గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడతారు. ఎందుకంటే ఈజీగా తీసి వంట చేయవచ్చు అనుకుంటారు. ఇది చాలా మందికి ఉన్న అలవాటు. వంటగదిలో ఏదైనా ఎక్కడైనా పెడితే అది అక్కడే ఉంచేస్తాం. ఐటెమ్‌ను ఉంచిన తర్వాత ఏ కారణం చేతనైనా స్థానాన్ని మార్చం. ఎందుకంటే మనకు వంట చేసే సమయంలో వెంటనే చేయి అక్కడకు వెళ్లి కావలసినది తీసుకోవచ్చు. ప్రతిరోజూ అదే స్థలంలో ఆ వస్తువును ఉంచడం ప్రారంభిస్తాం. ఇది సమయం ఆదా చేస్తుంది, అవసరమైనప్పుడు వెతకాల్సిన పని ఉండదు.

అయితే మీకు గ్యాస్ స్టవ్ దగ్గర వంటనూనె పెట్టే అలవాటు ఉంటే ఈరోజు ఆ అలవాటు మానేసి ఆ ప్లేస్ మార్చుకోండి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర వంట నూనెను ఉంచడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక ప్రమాదాలు వస్తాయి.

ఆక్సీకరణ

గ్యాస్ స్టవ్ దగ్గర ఆయిల్ బాటిళ్లను ఉంచడం వల్ల ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఇది ఆయిల్ రాన్సిడ్‌గా మారుతుందని, ఇది క్యాన్సర్ కణాల పుట్టుకకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ బాటిల్‌లో ఆయిల్ పెట్టుకుంటాం. దీనితో వేడి తగిలి బాటిల్ కరిగే అవకాసం కూడా ఉంటుంది.

అనేక సమస్యలకు కారణం

వంట నూనెలు అధిక కొవ్వు పదార్థాలతో ఉంటాయి. మీరు బాటిల్ లేదా ప్యాకెట్ తెరిచిన వెంటనే రసాయన ప్రక్రియకు లోనవుతాయి. అధిక ఆక్సీకరణ కారణంగా దీనిలో మార్పులు వస్తాయి. మీ శరీరంలో రాన్సిడ్ ఆయిల్ చేరడం అకాల వృద్ధాప్యం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, భారీగా బరువు పెరగడానికి దారితీస్తుంది. స్టవ్ దగ్గర నూనె వదిలేస్తే టైప్-2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

వంట నూనెను ఎలా నిల్వ చేయాలి?

ప్రతి ఒక్కరూ వంట నూనెను సులభంగా అందుబాటులో ఉంచడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అన్ని వంటల తయారీకి నూనె చాలా అవసరం. కానీ దానిని ఎక్కడ నిల్వ చేయాలి? దీన్ని ఎలా ఉంచుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. ఆయిల్ బాటిల్ తెరిచిన తర్వాత, గాలి ప్రవేశించకుండా గట్టిగా మూసివేయాలి. దాని నాణ్యతను కాపాడుకోవడానికి నూనెను వేడి తగలని చోట, దూరంగా చిన్నగది లేదా క్యాబిన్ వంటి చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. గాలి, కాంతి నుండి రక్షించడానికి రసాయన ప్రతిచర్యలకు గురికాకుండా ఉండటానికి గట్టిగా కప్పి ఉంచండి.

ఆలివ్ నూనెను కాంతి, వేడి నుండి దూరంగా నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఈ నూనెను 3 నెలలు ఉపయోగించవచ్చు.

ఇటీవల నూనెల్లో కల్తీ, నకిలీ నూనెలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రాండెడ్ నూనెలను నకిలీవి చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. చాలా నూనెలు కల్తీ కావడం వల్ల ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతోంది. ఇది క్యాన్సర్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే సరైన నూనె ఎంచుకుని వాడాలి. అవసరమైతే నూనెను పరీక్షించాలి. ఎక్కువగా ఆయిల్ తినకుండా ఉండాలి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024