Chiranjeevi: విశ్వంభర సెట్‌లో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్.. చిరంజీవితో కొత్త సినిమా చేయనున్నాడా?

Best Web Hosting Provider In India 2024


VV Vinayak Chiranjeevi Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’. కల్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విశ్వంభర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

విశ్వంభర‘ మూవీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్‌లో చాలా కేర్ తీసుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌‌లో వేసిన మాసీవ్ సెట్‌లో విశ్వంభర చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సెట్‌లోకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వీవీ వినాయక్ వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు.

చిత్ర యూనిట్‌కి, డైరెక్టర్ వశిష్టకి ఆల్ ది బెస్ట్ చెప్పారు వీవీ వినాయక్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వీవీ వినాయక్ కలసి ఉన్న ఫోటోని మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. దీంతో ఈ ఈ ఫొటో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొన్ని రూమర్స్ సైతం జోరుగా ప్రచారం అవుతోన్నాయి.

మెగాస్టార్ చిరంజీవితో వీవీ వినాయక్ మరోసారి సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు టాక్ నడుస్తోంది. అందుకోసమే విశ్వంభర సెట్‌కు వీవీ వినాయక్ వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. విశ్వంభర సెట్‌లో తాను అనుకున్న కథ గానీ, స్టోరీ పాయింట్ చిరంజీవికి వీవీ వినాయక్ చెప్పారని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవికి స్టోరీ పాయింట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా కథ డెవలప్ చేసేందుకు వీవీ వినాయక్ ప్రయత్నిస్తున్నట్లు నెటిజన్స్ జ్యోతిష్యం చెబుతున్నారు. మరి ఈ విషయంపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, చిరంజీవి, వినాయక్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన వీవీ వినాయక్ అనేక హిట్స్ సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా చిరంజీవికి ఠాగూర్ వంటి సెన్సేషనల్ హిట్ అందించారు. ఆ అనుబంధంతోనే వీవీ వినాయక్‌కు చిరంజీవి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇటీవలే భోళా శంకర్ సినిమాతో ప్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్‌కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎలాంటి సినీ అవకాశాలు లేని, స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందిన వీవీ వినాయక్‌కు చిరు తన సినిమాతో కమ్ బ్యాక్ హిట్ ఇస్తారని ఎవరికీ వారు ఊహించుకుంటున్నారు.

కాగా విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే వీరిలో చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణన్ నటించనుందని తెలుస్తోంది. ఇదివరకు వీరిద్దరూ స్టాలిన్ సినిమాలో హీరోహీరోయిన్లుగా చేసిన విషయం తెలిసిందే. ఇక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీ అయిన విశ్వంభరను విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

విశ్వంభర చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ విశ్వంభర సినిమా వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024