Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: టీడీపీ నేతలే అరాచకాలు సృష్టించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియా టెర్రరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరమన్నారు. బూతులు తిడుతూ అధికారులపై దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా? అని ప్రశ్నించారు. మీడియా ద్వారా దేశాన్ని శాసించాలని రామోజీ భావిస్తున్నాడు. సాక్షి వచ్చాకే రామోజీ ఆగడాలకు అడ్డుకట్ట పడిందన్నారు. ఎన్టీఆర్ను గద్దెదించడంలో చంద్రబాబుకు రామోజీ సహకరించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబు, రామోజీలకు అలవాటు అన్నారు. వ్యక్తిత్వ హననం చేయడమే చంద్రబాబు, రామోజీల పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు నేర్పించి ఒక ఆంబోతులా పట్టాభిని ప్రజల మీదకు వదిలారు. బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే పట్టాభికి డిస్టిక్షన్ వస్తుందన్నారు. ఈనాడు తప్పుడు వార్తలపై తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.