Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసి క్షమాపణ చెప్పని ఈనాడు అధినేత రామోజీరావుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మంత్రి జోగి రమేష్ వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈనాడు పత్రికపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ప్రజలు ఎల్లో మీడియాను దహనం చేస్తారు. రామోజీ అండ్ కో ప్రతీరోజు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. 32 పథకాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు పొందారు. సంక్షేమం అంటే ఏవిధంగా ఉంటుందో చూపించాం. సామాజిక న్యాయం ఏంటో చూపించాం. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉంది. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీ సాక్షిగా సామాజిక న్యాయంపై చర్చిద్దాం.