Best Web Hosting Provider In India 2024

గుంటూరు: తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యే అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. జగనన్న సేవకుడు శివకుమార్ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కిందని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు.