Female condoms: మహిళలు కూడా కండోమ్స్ వాడొచ్చు.. దాన్ని ఎలా వాడాలో తెల్సుకోండి

Best Web Hosting Provider In India 2024

ఎంత అప్‌డేటెడ్ తరంలో ఉన్నా కూడా.. లైంగిక భద్రత, లైంగిక సమస్యలు, శారీరక సంబంధాలు, నెలసరికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే చాలా మంది మహిళలు నోరెత్తరు. లేదంటే బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గు పడతారు. అంతే కాక వీటి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అనారోగ్యాల భారిన కూడా పడతారు. ఇక ముఖ్యంగా అవాంఛిత గర్భధారణ రాకుండా పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా కండోమ్స్ వాడొచ్చనే విషయం చాలా తక్కువ మందికే తెల్సు. అసలు ఈ ఫీమేల్ కండోమ్ అంటే ఏమిటి, దాన్నెలా ఉపయోగిస్తారు, దీని ప్రయోజనాలేంటో వివరంగా తెల్సుకుందాం.

 

ఫీమేల్ కండోమ్ అంటే ఏమిటి?

ఫెమిడోమ్స్ అని కూడా పిలువబడే ఫీమేల్ కండోమ్ పాలియురేథేన్ అని పిలువబడే మృదువైన, సన్నని ప్లాస్టిక్ తో తయారవుతుంది. సంభోగం సమయంలో, వీర్యం గర్భాశయానికి చేరకుండా నిరోధించడానికి స్త్రీ కండోమ్ యోనిలోకి చొప్పించబడుతుంది.

ఫీమేల్ కండోమ్ ఎలా ఉపయోగించాలి?

పురుషుల కోసం తయారు చేసిన కండోమ్ల కంటే మహిళల కోసం తయారు చేసిన కండోమ్‌లు పరిమాణంలో పెద్దవి. పీరియడ్స్ సమయంలో టాంపన్లు వాడే మహిళలకు ఈ ఫిమేల్ కండోమ్ వాడటం పెద్ద కష్టమేమీ కాదు. టాంపన్ ను యోని లోపల చొప్పించినట్లే, ఈ ఫీమేల్ కండోమ్ కూడా యోని లోపల చొప్పించాలి. ఇలా చేసేటప్పుడు కండోమ్ ను మెలితిరగొద్దని గుర్తుంచుకోండి. కండోమ్ బయటి వైపు ఉండే రింగు ను యోని నుండి ఒక అంగుళం దూరంగా ఉంచాలి. సంబోగం తర్వాత దీన్ని చేతితో పట్టుకుని తీసేయాల్సి ఉంటుంది.

ఫీమేల్ కండోమ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. మీ భాగస్వామి కండోమ్స్ వాడకపోతే, మీరు గర్భనిరోధక మాత్రలు తీసుకోడానికి ఇష్టపడకపోతే, ఈ ఫీమేల్ కండోమ్ ఉపయోగించవచ్చు.

2. సరిగ్గా ఉపయోగించినట్లయితే, ఫీమేల్ కండోమ్స్ ఎస్టీడీలు, ఎస్టీఐలు, హెచ్ఐవి వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి, అవాంఛిత గర్భధారణ రాకుండా కాపాడడంలో సాయపడతాయి.

 

3. ఫీమేల్ కండోమ్స్ వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

 

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024