Best Web Hosting Provider In India 2024

మాజీ రాష్ట్రపతికి వైయస్ జగన్ ఘన నివాళులు
తాడేపల్లి: దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను వైయస్ జగన్ గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. “కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి“ అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.