Rain alert : ఈ 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​

Best Web Hosting Provider In India 2024


దేశంలోని పలు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్​లో ఆగస్టు 6న భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆయా రాష్ట్రాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

 

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

దేశ రాజధాని దిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సాధారణంగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రోజంతా గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.

 

వాయవ్య భారత..

“జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్​లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి / మోస్తరు వర్షపాతం చాలా విస్తృతంగా ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా-చండీగఢ్-దిల్లీలో ఈ వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ తెలిపింది.

 

ఆగస్టు 6, 8, 9 తేదీల్లో రాజస్థాన్​లో, ఆగస్టు 7న హిమాచల్ ప్రదేశ్​లో, ఆగస్టు 6/7, 9 తేదీల్లో ఉత్తరాఖండ్​లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

పశ్చిమ భారతదేశంలో..

వాతావరణ బులెటిన్ ప్రకారం.. “ఈ వారంలో కొంకణ్ – గోవా, గుజరాత్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వారంలో మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.”

 

మధ్యప్రదేశ్​లో ఆగస్టు 9 వరకు, ఛత్తీస్​గఢ్​లో ఆగస్టు 7 వరకు, గోవాలో ఆగస్టు 10 వరకు, మహారాష్ట్ర, గుజరాత్​లో ఆగస్టు 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

 

తూర్పు, ఈశాన్య భారతంలో

తూర్పు, ఈశాన్య భారతంలో ఈ వారంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

 

అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఆగస్టు 10 వరకు, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఆగస్టు 6 వరకు, ఒడిశాలో ఆగస్టు 7న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

దక్షిణ ద్వీపకల్పం..

కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగస్టు 10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగస్టు 6న తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

 

చిత్రంగా నైరుతి రుతుపవనాల ప్రభావం..

ఈ ఏడాది దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం చిత్రంగా ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్​లో 11 శాతం వర్ష లోటుతో ప్రారంభమై భారతదేశం అంతటా విస్తరించాయి. మధ్య, దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతంనమోదవ్వగా.. వాయువ్య, తూర్పు ప్రాంతాలు వర్ష లోటుతో సతమతమవుతున్నాయి. ఫలితంగా జలాశయాల్లో నీటి మట్టాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source link