Best Web Hosting Provider In India 2024

విజయవాడ: ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంకల్ప సిద్ధితో ఆరు రోజుల పాటు సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయంతంగా జరిగిందని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే గొప్ప సంకల్పంతో మహాయజ్ఞం మొదలైందన్నారు. సీఎం సంకల్ప సిద్ధితో ఆరు రోజులు చిన్న అవాంతరం కూడా చోటుచేసుకోకుండా యజ్ఞ క్రతువు సజావుగా, విశేషంగా జరిగిందని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12వ తేదీన మొదలైన అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నేడు అఖండ పూర్ణాహుతితో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. యజ్ఞం ముగిసిన అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.