Best Web Hosting Provider In India 2024

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మైనారిటీల పక్షపాతి అని మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. హజ్ యాత్రికులకు రూ. 14.51 కోట్ల ప్రత్యేక ఆర్ధిక సహాయం చేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు కృతఙ్ఞతలు తెలిపారు. బుధవారం విజయవాడ నగరంలో ముస్లిం మైనారిటీలు సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక పంజా సెంటర్ వద్ద గల షాజహూర్ ముసాఫిర్ ఖానా లో ఎన్టీఆర్ జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న మైనారిటీ సోదరులకు వాక్సినేషన్, యాత్ర నియమ నిబంధనలు తెలిపేందుకు రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజాం, ఎన్టీఆర్ జిల్లా వై యస్ ఆర్ సిపి అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు , శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ముందుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.