Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: మేనిఫెస్టో హామీల అమలుపై దమ్ముంటే చంద్రబాబు చర్చకు రావాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని సవాలు విసిరారు. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైయస్ఆర్‌సీపీని మూవేస్తాo.. 2014లో టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. అదే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారు. 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.