వైయస్‌ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌

కార్పొరేటర్‌ పీవీ సురేష్‌కే రౌడీషీట్‌ను తొలగించాలని విశాఖలో ఆందోళన

విశాఖ: వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ పీవీ సురేష్‌పై పెట్టిన రౌడీషీట్‌ను తొలగించాలని డిమాండు చేస్తూ  విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే రౌడీషీట్‌ తెరిచారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల సంపద సృష్టి కోసం కొత్త మద్యం పాలసీ తెచ్చారన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి టీడీపీ నేతల ఆదాయం పంచుకున్నారని విమర్శించారు. మూడు నెలల్లో వీధికో బెల్ట్‌ షాపులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి ఇంటికి మద్యం సరఫరా స్కీమ్‌ తీసుకొస్తారని ధ్వజమెత్తారు. రౌడీషీట్‌ ఎత్తేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు.
టీడీపీ నేతల కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే పీవీ సురేష్‌పై రౌడీషిట్‌ తెరిచారన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
 

Best Web Hosting Provider In India 2024