Maddur vada: మద్దూర్ వడలు ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది, దీపావళికి ఓసారి ట్రై చేయండి

Best Web Hosting Provider In India 2024

దీపావళికి స్వీట్లు కాదు కొన్ని రకాల పిండి వంటలు రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము బియ్యప్పిండితో చేసే మద్దూర్ వడలను ఎలా చేయాలో చెప్పాము. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. కర్ణాటక స్టైల్‌లో చేసే మద్దూరు వడలు మీకు పండగ ఫీలింగ్ ను ఇస్తాయి. దీపావళి నాడు స్వీట్లతో పాటు ఈ హార్ట్ రెసిపీ కూడా వండి చూడండి. మీకు కచ్చితంగా నచ్చడం ఖాయం. ఇవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఈ గారెలను ఎలా చేయాలో తెలుసుకోండి.

మద్దూర్ వడలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి – అరకప్పు

మైదాపిండి – పావు కప్పు

ఉల్లితరుగు – అర కప్పు

ఉప్మా రవ్వ – పావు కప్పు

పచ్చిమిర్చి – మూడు

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ఇంగువ – చిటికెడు

కరివేపాకులు – గుప్పెడు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

మద్దూర్ వడలు రెసిపీ

1. ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉప్మా రవ్వ, మైదాపిండి వేసి బాగా కలపాలి.

2. అలాగే ఉల్లి తరుగును, పచ్చిమిర్చి తరుగును, కరివేపాకుల తరుగును, కొత్తిమీర తరుగును, ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి.

3. తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి బాగా వేడి చేయాలి.

6. తర్వాత పిండి నుంచి చిన్న ముద్దను తీసుకొని వడల్లా ఒత్తుకొని వాటిని నూనెలో వేయాలి.

7. నూనెలో వేసిన వడలను బంగారంలో రంగు వచ్చేదాకా వేయించుకుంటే మద్దూరు వడలు రెడీ అయిపోతాయి.

8. ఇవి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి.

9. ఈ వడలను కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

10. అలాగే పుదీనా చట్నీతో తిన్నా కూడా బావుంటాయి.

11. వీటిని ఒక్కసారి మీరు చేసుకొని చూడండి మీకు ఎంతగా నచ్చుతాయో.

ఈ మద్దూరు వడలలో మీకు మైదాపిండి వేయడం ఇష్టం లేకపోతే మానేయవచ్చు. మైదాపిండి చాలామంది తినడానికి ఇష్టపడరు. అది వేయకపోయినా కూడా ఈ మద్దూరు వడల రుచి పెద్దగా మారదు. కాబట్టి మైదాపిండి లేకుండానే ఈ మద్దూరు వడలను వండుకోవాలి అనుకునేవారు ప్రయత్నించండి. ఇవి కచ్చితంగా మీకు నచ్చుతాయి. వీటితో కచ్చితంగా ఏవో ఒక చట్నీ పక్కన పెట్టుకోండి. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చి తరుగును ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024