Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి
అనంతపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా దోపిడికి తెర తీశారని వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఎస్.వి.మోహన్ రెడ్డి స్పందించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దోపిడీ పెరిగిపోతుంది, ఆదాయ అర్జనే లక్ష్యంగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైయస్ జగన్ పాలనలో ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటే కూటమి నేతలు మాత్రం దోపిడీ, వసూళ్ళకు తెగబడుతున్నారని విమర్శించారు.
ఇసుకపై టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పేరుతో రీచ్‌లన్నీ టీడీపీ నేతలకు కట్టబెట్టారు.
ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది, పొరుగు రాష్ట్రాలకు లారీల కొద్ది తరలిస్తున్నారు, అనంతపురం జిల్లా నుంచి బళ్ళారి, బెంగళూరుకు వందలాది లారీల ఇసుక రోజూ తరలిస్తున్నారు
ఉచిత ఇసుక అని చెబుతూనే ఎక్కడ చూసినా వేలాది రూపాయిలు చెల్లిస్తే తప్ప దొరకడం లేదు, పైగా టీడీపీ నాయకుల అనుమతి ఉంటేనే ఇసుక అందుతోందని పేర్కొన్నారు.