
Best Web Hosting Provider In India 2024

అతి ముఖ్యమైన హిందూ పండగల్లో నాగుల చవితి ఒకటి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పండుగ ఇది. ఈ పవిత్రమైన రోజున పాములను పూజిస్తారు. పువ్వులు, పాలు, ప్రత్యేకమైన ప్రసాదాలతో నాగేంద్రుని పూజించి తమకు అదృష్టాన్ని, శ్రేయస్సును ఇమ్మని కోరుతారు. హిందూ పురాణాలలో పాములు ఎంతో ముఖ్యమైనవి. వీటి నుంచి రక్షణ కల్పించమని కోరుతూ నాగుల అధిదేవత అయిన సుబ్రమణ్య స్వామిని పూజిస్తారు. ఈ నాగుల చవితి రోజు బంధుమిత్రులకు శుభాకాంక్షలు పంపే వారి సంఖ్య ఎక్కువే. ఒక అందమైన కోట్స్, విషెస్ తో వారిని నాగుల చవితి రోజు పలకరించండి. మెసేజులను పంపి వారికి నాగుల చవితి రోజు అంతా మంచే జరగాలని కోరుకోండి.