Hyderabad BDL Apprenticeship : హైదరాబాద్ బీడీఎల్ లో 150 అప్రెంటిస్ పోస్టులు, దరఖాస్తులకు నవంబర్ 25 ఆఖరు తేదీ

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ కంచన్ బాగ్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)లో 150 అప్రెంటిస్ షిప్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 25వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడాది పాటు అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ నవంబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ హార్డ్ కాపీని డిసెంబర్ 06 లోపు కంచన్ బాగ్ బీడీఎల్ కు పంపాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 150

  • ఫిట్టర్ – 70
  • ఎలక్ట్రీషియన్ -10
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 26
  • మెషినిస్ట్- 14
  • మెషినిస్ట్ గ్రైండర్ -02
  • మెకానిక్ డీజిల్- 5
  • మెకానిక్ R & AC -5
  • టర్నర్- 14
  • వెల్డర్- 4

అర్హత: 10th/SSC ఉత్తీర్ణతతో పటు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత

వయో పరిమితి : జనరల్ అభ్యర్థుల వయస్సు నవంబర్ 11, 2024 నాటికి 14 నుంచి 30 కంటే మధ్య ఉండాలి.

వయస్సు సడలింపు :

  • ఎస్సీలు- 5 ఏళ్లు
  • ఎస్టీలు – 5 ఏళ్లు
  • ఓబీసీ-3 ఏళ్లు
  • జనరల్-పీడబ్ల్యూ- 10 ఏళ్లు
  • ఓబీసీ-PWD -13 ఏళ్లు
  • SC/ST-PWD -15 ఏళ్లు

అర్హులైన అభ్యర్థులు https://apprenticeshipindia.org/candidate-registration పోర్టల్‌లో అప్రెంటిస్‌గా నమోదు చేసుకోవాలి.

ఎంపిక విధానం

అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వివిధ ట్రేడ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా విడిగా పరిశీలించి, మార్కుల ఆధారంగా ప్రతి ట్రేడ్‌కు సాధారణ మెరిట్ జాబితా తయారు చేస్తారు. అవసరమైన అర్హత ప్రకారం అర్హతగల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ/SSC ఉత్తీర్ణత, ఐటీఐ మార్కులకు వెయిటేజీ ఇస్తారు.

ముఖ్యమైన లింక్ లు

బీడీఎల్ వెబ్ సైట్ లింక్

అప్రెంటిస్ షిప్ నమోదు లింగ్

బీడీఎల్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా… కోఆపరేటివ్ ఇంటెర్న్స్ ను భర్తీ చేస్తారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లో కేవలం ఒక ఖాళీ ఉండగా… మరో 9 పోస్టులు డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని… ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాలని వివరించారు.

పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ట్రూప్ బజార్ బ్రాంచ్ ఆఫీస్,హైదరాబాద్ – 500001 లో సమర్పించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్) లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. https://tscab.org/notifications/ లింక్ పై క్లిక్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

HyderabadJobsTrending TelanganaTelangana NewsTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024