


Best Web Hosting Provider In India 2024

TS Inter Hall Tickets 2025 : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
TS Inter Hall Tickets 2025 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు నేరుగా తమ కాలేజీ ప్రిన్సిపాల్ ను సంప్రదించి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీషు, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ హాల్ టికెట్లను సైట్ లో నేరుగా పొందవచ్చు.
TS Inter Hall Tickets 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. హాల్ టికెట్లను కాలేజీల లాగిన్‌లలో అప్లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ సంబంధిత కాలేజీల నుంచి హాల్ టికెట్లను పొందవచ్చు. హాల్ టికెట్లలో ఏమైన తప్పులు, తేడాలు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, అధికారులను సంప్రదించాలని బోర్డు సూచించింది.
మార్చి 5 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. వార్షిక పరీక్షలను సజావుగా నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంట్రీ గేటు వద్ద, పరీక్ష ప్రశ్నా పత్రం ఓపెన్ చేసే ప్రిన్సిపాల్ రూమ్ లో, కాలేజి వెనక మైదానం కవర్ అయ్యేలా ఒక్కో సెంటర్ కి మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంటర్ ఫస్లియర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. హాల్ టికెట్లు ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్లను తీసుకురాకపోతే పరీక్ష హాల్ లోకి రానివ్వరు. విద్యార్థులు హాల్ టికెట్లను తమ కాలేజీల ద్వారా నేరుగా పొందవచ్చు.
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ ఇలా
- తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ సందర్శించండి.
- హోమ్‌పేజీలో డౌన్ లోడ్ హాల్ టికెట్స్ మార్చి 2025 ఆప్షన్ లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
- విద్యార్థి లాగిన్ వివరాలను నమోదు చేయండి.
- మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు సూచన కోసం అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.
- మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1.
- మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.
- మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.
- మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1.
- మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.
- మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1.
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.
- మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2.
- మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.
- మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
- మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2.
- మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.
- మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2.
సంబంధిత కథనం
టాపిక్