TG AP MLC Elections : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Best Web Hosting Provider In India 2024

TG AP MLC Elections : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Basani Shiva Kumar HT Telugu Feb 25, 2025 05:25 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Feb 25, 2025 05:25 PM IST

TG AP MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. మార్చిన 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ముగిసిన ఎన్నికల ప్రచారం
ముగిసిన ఎన్నికల ప్రచారం (istockphoto)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు 27వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుంది. ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

మద్యం షాపులు బంద్..

తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. కల్లు కంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతాయి. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.

చెల్లని ఓట్లు..

గతంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో చదువుకున్న వారు కూడా ఓటింగ్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ ఓటు చెల్లుబాటు అయ్యేలా వేయాలని సూచిస్తున్నారు.

ఓటు వెయ్యండిలా..

బ్యాలెట్‌ పత్రంలో పోలింగ్‌ సిబ్బంది ఇచ్చే వాయిలెట్‌ రంగు స్కెచ్‌ పెన్నుతోనే ఓటు వెయ్యాలి. వేరే పెన్ను, పెన్సిల్‌ను ఉపయోగించొద్దు. టిక్‌ పెట్టడం, ఓకే అనే అక్షరాలు కూడా రాయకూడదు. మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బ్రాకెట్‌లో 1 నంబర్ వేయాలి. అంకె వేయకుండా 2, 3, ఇతర సంఖ్యలను వేయకూడదు. కచ్చితంగా 1 అంకె ఎవరికైనా ఇవ్వాలి.

ఒక అభ్యర్థికి ఒక అంకె..

అభ్యర్థుల్లో కచ్చితంగా 1 అంకె ఎవరికైనా వేయాలి. మిగతా అభ్యర్థులకు వేయడమనేది ఓటరు ఇష్టం. 1 అంకె తరువాత మిగతా 2, 3, 4 ఇలా నచ్చిన అభ్యర్థికి అంకెలను వారి పేరు పక్కన సూచించిన బ్రాకెట్‌లో వేయాలి. ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్య సంఖ్యను మాత్రమే ఇవ్వాలి. ఒకే అంకెను ఇద్దరి ముగ్గురికి ఇవ్వొద్దు. 1, 2, 3, 4 లేదా రోమన్‌ అంకెలు వరుసగా నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యంగా వేయాలి.

ఇలా చేస్తే చెల్లవు..

ఇంగ్లీష్‌లో వన్‌ అని.. ఓకె అని ఇతర గుర్తులు, పదాలు అస్సలు రాయకూడదు. కేవలం అంకెలను మాత్రమే రాయాలి. బ్యాలెట్‌లో పేరు, సంతకం ఇతర అక్షరాలు ఏవి రాసినా అవి చెల్లవు. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. అభ్యర్థి, పేరు, ఫొటో పక్కన ఉన్న బ్రాకెట్‌లో మధ్యలోనే అంకెను వేయాలి. అభ్యర్థి పేరున్న గడి గీత దాటి వేయొద్దు. పేరుపైన టిక్‌ చేయొద్దు. వరుస సంఖ్యపైన మార్క్‌ చేయొద్దు. అలా చేస్తే ఆ ఓటు చెల్లదు.

Whats_app_banner

టాపిక్

Telangana Mlc ElectionsTs PoliticsTelangana NewsAp Mlc Elections
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024