



Best Web Hosting Provider In India 2024

Low Budget Travel: మీ జేబులో 50వేల రూపాయలు ఉంటే చాలు, ఈ దేశాలను చూసి వచ్చేయొచ్చు వీసా అవసరమే లేదు
Low Budget Travel: మీ దగ్గర 50వేల రూపాయలు ఉన్నాయా? అయితే మీరు చక్కగా విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. వీసా అవసరం లేని దేశాలు ఇదిగో.
విదేశీ ప్రయాణాలు చేయాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ అవి ఖర్చుతో కూడుకున్నవని ఎంతో మంది వెనకడుగు వేస్తారు. కొన్ని రకాల దేశాలకు వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ కొన్ని తక్కువ ఖర్చుతో వెళ్లే దేశాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. పైగా వీటికి వీసా కూడా అవసరం లేదు. మీ దగ్గర 50 వేల రూపాయలు ఉంటే చాలు… ఉచిత ప్రవేశ వీసా ఇస్తున్న దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అందమైన దేశాలను సందర్శించేందుకు ప్రయత్నించండి. అది కూడా అది తక్కువ ఖర్చులో.
భూటాన్
భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న దేశం భూటాన్. మీ దగ్గర 50వేల రూపాయలు ఉంటే చాలు… ఈ దేశాన్ని సులువుగా సందర్శించవచ్చు. ఎందుకంటే అది మన దేశానికి దగ్గరగానే ఉంటుంది. అక్కడ అన్నీ చవకగానే ఉంటాయి. పైగా ఆ దేశానికి వెళ్లే భారతీయులకు 15 రోజులు పాటు వీసా కూడా అవసరం లేదు. 15 రోజుల్లో మీరు పర్యటన ముగించుకుని ఇంటికి వచ్చేయొచ్చు. హిమాలయాల్లో ఉన్న ఈ దేశం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. మంచుతో కప్పిన శిఖరాలు, మఠాలు కంటిని ఆకర్షిస్తాయి. అద్భుతమైన సంస్కృతికి భూటాన్ ప్రసిద్ధి చెందింది. అందమైన ప్రకృతి ఒడిలో ఆడుకున్నట్టే ఉంటుంది భూటాన్.
మారిషస్
హిందూ మహాసముద్రం మధ్యలో ఉంది మారిషస్. ఇది ఎంతో అందమైన దేశం. మీ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్ లోనే ఈ దేశాన్ని చుట్టి రావచ్చు. 50 వేల నుంచి లక్ష రూపాయలలోపే మారిషస్ వెళ్లడానికి ఖర్చు అవుతుంది. వీసా కూడా ఇబ్బంది పడక్కర్లేదు. మన దేశం నుంచి వచ్చే వారికి మారిషస్ వీసా అడగదు.
థాయిలాండ్
థాయిలాండ్ దక్షిణాసియాలోనే ఉన్న దేశాలలో అందమైన దేశం. మీరు తక్కువ ఖర్చులోనే తిరగగలిగే దేశం కూడా ఇది. ఇక్కడ ఉన్న దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు కచ్చితంగా చూసి తీరాల్సినవే. 50 వేల రూపాయలతో ఒక మనిషి చవకగా వెళ్లి రావచ్చు. అదే కుటుంబంతో వెళ్ళాలి అనుకుంటే మరొక లక్ష రూపాయలు అదనంగా అవుతుంది. అక్కడ ఆహారపు ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి.
కరేబియన్
కరేబియన్ ఒక ద్వీపం. కరేబియన్ దేశం వెళ్లడానికి కూడా పెద్దగా ఖర్చు కాదు. మీ దగ్గర 50 వేల రూపాయలు ఉంటే మీరు ఒక్కరే వెళ్లి రావచ్చు. అదే ఇద్దరు వెళ్లాలనుకుంటే లక్ష రూపాయలు అవసరం పడుతుంది. ఈ దేశానికి వెళ్లడానికి కూడా వీసా అవసరం లేదు. మన దేశం నుంచి వచ్చే వారికి కరేబియన్ దేశం వీసాను అడగదు. ఇక్కడ పిటన్స్ నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ ఉండే అతి ఎత్తైన అగ్నిపర్వతాన్ని చూసేందుకు ఖచ్చితంగా కరేబియన్ దేశం వెళ్లి రావాల్సిందే.
సంబంధిత కథనం