



Best Web Hosting Provider In India 2024

Mad Square Teaser: బిచ్చపోడి బట్టలు వేసుకున్న నీకన్నా బాగుంటా.. మ్యాడ్‌కు మించిన కామెడీ.. మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్!
Mad Square Teaser Released Today: మ్యాడ్ స్క్వేర్ టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాడ్ స్క్వేర్ టీజర్లో మ్యాడ్‌కు మించిన కామెడీ చేశారు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. అదిరిపోయే పంచ్‌లు ప్రియాంక జావల్కర్ స్పెషల్ ఎంట్రీతో కడుపుబ్బా నవ్వించేలా మూవీ టీజర్ ఉంది.
Mad Square Teaser Released: బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్‘ టీజర్ విడుదలైంది.
మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 25) విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్‌తో తెలిసిపోతోంది. మ్యాడ్ మూవీకి ఏమాత్రం తీసిపోకుండా మ్యాడ్ స్క్వేర్ ఉంటుందని టీజర్ ద్వారా అర్థం అవుతోంది.
అంతకుమించిన అల్లరి
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్‌తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు) ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయనున్నారు.
కట్నాలు చదివించిన డైరెక్టర్స్
మ్యాడ్ స్క్వేర్ టీజర్లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నిమిషం 53 సెకన్ల పాటు సాగిన మ్యాడ్ స్క్వేర్ టీజర్ ఆద్యంతం నవ్విస్తూనే ఉంది. “వెంకీ అట్లూరి వెయ్యి నూట పదహారు, అనుదీప్ కేవీ 516, సూర్యదేవర నాగ వంశీ 116 మాత్రమే సదివించిండు” అని టీజర్ ఆరంభంలోనే ఫన్ జెనరేట్ చేశారు.
ప్రియాంక జావల్కర్ అప్పీయరన్స్
మామ బిచ్చపోడి బట్టలు వేసుకున్న నీకన్న బాగుంటా, చిన్నాన్న.. హా పెద్దనాన్న అని సంగీత్ శోభన్ చెప్పే డైలాగ్స్, విష్ణు స్వీట్ పెట్టి దాని పేరు చెప్పడం వంటివి అట్రాక్ట్ చేశాయి. అలాగే, పెట్రోలా, డీజిలా అని అడిగితే ఏది తక్కువ అయితే అది కొట్టమని నార్నే నితిన్ మరింత నవ్వించేలా ఉంది. ఇవే కాకుండా ప్రియాంక జావల్కర్ స్పెషల్ అప్పీయరన్స్, ముగ్గురు గోవాకు వెళ్లడం, అక్కడ అల్లరి చేయడం వంటి అనేక సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.
రెండు పాటలు హిట్
ఇకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత కథనం