



Best Web Hosting Provider In India 2024

Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ డిలీట్ అయిన సీన్లు కూడా..
Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ఈ వారమే ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలో డిలీట్ అయిన సీన్లు కూడా యాడ్ చేయబోతున్నారు.
Sankranthiki Vasthunam OTT: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి అడుగుపెడుతున్న సినిమాగా నిలవబోతోంది. అయితే అదే సమయంలో ఫ్యాన్స్ ను మరింత నవ్వించడానికి డిలీట్ చేసిన కామెడీ సీన్లు కూడా ఓటీటీలోకి వస్తున్నాయట.
సంక్రాంతికి వస్తున్నాం డిలీటెడ్ సీన్స్
ఈ మధ్య చాలా వరకు సినిమాలు సుదీర్ఘ రన్ టైమ్ తో వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల రన్ టైమ్ ను థియేటర్ల కోసం తగ్గిస్తున్నారు. దీనివల్ల కొన్ని సీన్స్ మిస్సవుతున్నాయి. వాటిని ఓటీటీలోకి తిరిగి చేరుస్తున్నారు. అలా ఈ మధ్యే పుష్ప 2 మూవీ కూడా అదనపు 20 నిమిషాల సీన్లను నెట్‌ఫ్లిక్స్ లో జోడించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ విషయంలోనూ అదే జరుగుతోంది.
థియేటర్లలో మూవీ రన్ టైమ్ తగ్గించడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెడీ సీన్లను డిలీట్ చేశాడు. ఇప్పుడా సీన్లను కూడా చేర్చి జీ5 ఓటీటీలోకి ఈ సినిమా అడుగుపెట్టబోతోంది. దీంతో మూవీ రన్ టైమ్ ఓటీటీలో కాస్త పెరగనుంది. ఇప్పటికే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ.. ఈ సీన్లతో మరింత నవ్వించబోతోంది.
ఒకే రోజు టీవీ, ఓటీటీలోకి..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుమారు 45 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అయితే ఒకే రోజు టీవీ, ఓటీటీలోకి వస్తుండటం విశేషం. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్ ఉంది.
అటు అదే సమయానికి ఇటు జీ5లోనూ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలు మొదట ఓటీటీలోకే వచ్చిన తర్వాత కొన్ని రోజులకు టీవీ ఛానెల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం మొదట టీవీలోకే రాబోతోంది.
సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్
సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైన్‍మెంట్‍తో తెరకెక్కించారు. సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారు. వెంకటేశ్ తన నటనతో మెప్పించేశారు. దీంతో ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టేసింది. ఈ మూవీ రూ.300కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ రేవంత్, సాయికుమార్, శ్రీనివాస్ అవసరాల, నరేశ్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.
సంబంధిత కథనం