



Best Web Hosting Provider In India 2024

Double Dhamaka: రవితేజ, శ్రీలీల ధమాకా సీక్వెల్‌పై డైరెక్టర్ ఆన్సర్- ఎవరితో చేస్తే బాగుంటుందో చెప్పిన త్రినాథ రావు నక్కిన
Mazaka Director Trinadha Rao Nakkina On Double Dhamaka: మజాకా మూవీ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల ధమాకా సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. సందీప్ కిషన్, రీతు వర్మ నటించిన మజాకా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డబుల్ ధమాకా ఎవరితో చేస్తే బాగుంటుందో డైరెక్టర్ చెప్పారు.
Mazaka Director Trinadha Rao Nakkina On Double Dhamaka: మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జోడీగా నటించిన సినిమా ధమాకా. బాక్సాఫీస్ వద్ద ధమాకా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ధమాకు సీక్వెల్‌పై చాలా అంచనాలు ఉన్నాయి.
డబుల్ ధమాకా టైటిల్‌తో
ధమాకా సీక్వెల్‌ను డబుల్ ధమాకా అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే, సందీప్ కిషన్, రీతు వర్మ జోడీగా, రావు రమేష్-అన్షు కీలక పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, సంబాషణలు అందించిన మజాకా మూవీ ఇవాళ (ఫిబ్రవరి 26) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంట్రెస్టింగ్ ఆన్సర్
ఈ నేపథ్యంలో మజాకా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు త్రినాథ రావు సినీ విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో డబుల్ ధమాకాపై మీడియా అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రసన్న ఈ కథ చెప్పిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేశారు?
– ప్రతి సినిమాకి మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ, ఈ సినిమా వరకూ స్క్రిప్ట్‌లో నేను పెద్దగా ఇన్వాల్ కాలేదు. కంప్లీట్ బైండ్ స్క్రిప్ట్‌తో వచ్చారు ప్రసన్న. అప్పటికే అన్ని మార్పులు చేర్పులు చేసి సీన్స్, విత్ డైలాగ్స్‌తో వచ్చారు. ప్రసన్న, సాయి కృష్ణ ఇద్దరూ పక్కాగా రాసుకున్నారు. షూటింగ్ సమయంలో డైలాగుల్లో చిన్న చిన్న మార్పులు తప్పితే మజాకా కథ నా దగ్గరికి వచ్చేసరికే కంప్లీట్‌గా ఉంది.
అన్షు గారి ఛాయిస్ ఎవరిది?
-ఆ క్యారెక్టర్‌కి ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ఓ ఆర్టిస్ట్‌తో చేయిస్తే బావుంటుందని అనుకున్నాను. అప్పుడు మన్మథుడులో అన్షు అయితే ఎలా ఉంటుందని ప్రసన్నతో అన్నాను. తర్వాత నిర్మాత రాజేష్ గారు ఆమెని సంప్రదించారు. నేనే ఫోన్‌లో మాట్లాడి క్యారెక్టర్ గురించి చెప్పాను.
-ఆమెకు తెలుగు రాదు, అయినప్పటికీ చాలా కష్టపడి నేర్చుకొని ప్రతి డైలాగ్‌కి అర్థం తెలుసుకొని నటించడం చాలా అనందంగా అనిపించింది. ఒక అమ్మ క్యారెక్టర్ ఎలా చూడాలని అనుకుంటారో అన్షు క్యారెక్టర్ అలా ఉంటుంది.
ఖుషి రిఫరెన్స్ సీన్ సెన్సార్ అయిపోయందా?
-ఆ సీన్ ఉంది. కాకపోతే డైలాగ్‌ని సెన్సార్ చేశారు. నిజానికి ఆ డైలాగ్ ఉంటే థియేటర్‌లో మరో హై ఉండేది. సెన్సార్ వాళ్లకి కూడా ఆ డైలాగ్ చాలా నచ్చింది. చాలా నవ్వుకున్నారు. కానీ, కొన్ని రూల్స్ కారణంగా సెన్సార్ చేయాల్సి వచ్చింది.
డబుల్ ధమాకా గురించి
–రవితేజ గారితో డబుల్ ధమాకా చేస్తే బావుంటుంది. అదే ప్రయత్నం చేస్తున్నాను.
సంబంధిత కథనం