Best Web Hosting Provider In India 2024

Time Travel OTT: ఓటీటీలోకి వస్తున్న తెలుగు టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ – స్ట్రీమింగ్ డేట్…ప్లాట్‌ఫామ్ ఇవే!
Time Travel OTT: తెలుగు ట్రైమ్ ట్రావెల్ మూవీ రివైండ్ ఓటీటీలోకి వస్తోంది. మార్చి 7 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ మూవీలో సాయిరోనక్, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
Time Travel OTT: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన తెలుగు మూవీ రివైండ్ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మార్చి 7 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్‌ను లయన్స్ గేట్ ప్లే ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
సాయిరోనక్ హీరో…
రివైండ్ మూవీలో సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించాడు. సీనియర్ యాక్టర్ సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు లవ్‌స్టోరీ, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌ను జోడించి ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా…డైరెక్టర్ అనుభవలేమి కారణంగా తెలుగు ఆడియెన్స్‌ను రివైండ్ మూవీ మెప్పించలేకపోయింది.
రివైండ్ కథ ఇదే…
కార్తిక్(సాయి రోనక్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. తన ఆఫీస్‌లో కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన శాంతితో (అమృతా చౌదరి) ప్రేమలో పడతాడు. శాంతికి ప్రపోజ్ చేసే అవకాశం ఎదురుచూస్తుంటాడు. కానీ శాంతి ఐదేళ్లుగా మరో అబ్బాయితోప్రేమలో ఉందనే నిజం కార్తిక్‌కు తెలుస్తుంది. శాంతి తాత(సామ్రాట్) టైమ్ మిషన్‌ను కనిపెడతాడు. ఆ మిషన్ ద్వారా శాంతి తన ప్రియుడిని కలిసే రోజుకి టైం ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి కాకుండా చేయాలని కార్తిక్ నిర్ణయించుకుంటాడు.
టైమ్ ట్రావెల్ మిషన్ ద్వారా శాంతి ప్రేమను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తాడు. టై ట్రావెల్ మిషన్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్లిన కార్తీక్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? శాంతిని అతడు కలుసుకున్నాడా? అసలు శాంతి తాతకు చెందిన టైమ్ ట్రావెల్ మిషన్ కార్తీక్ ఇంటికి ఎలా వచ్చింది? అన్నదే రివైండ్ మూవీ కథ.
పదిహేనుకుపైగా సినిమాలు…
తెలుగులో హీరోగా పదిహేనుకుపైగా సినిమాలు చేశాడు సాయిరోనక్. ఎక్కువగా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్‌లోనే కనిపించాడు. అవకాశాలు వస్తోన్న కమర్షియల్ హిట్టు మాత్రం దక్కడం లేదు. గత ఏడాది రివైండ్‌తో పాటు లగ్గం సినిమాలు చేశాడు. సినిమాలే కాకుండా త్రీ రోజేస్, డెడ్ పిక్సెల్స్ వెబ్‌సిరీస్‌లు చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్