Bold OTT: ఓటీటీలోకి ష‌కీలా బ‌యోపిక్ – అడ‌ల్ట్ స్టార్ జీవితంలోని షాకింగ్ నిజాల‌తో!

Best Web Hosting Provider In India 2024

Bold OTT: ఓటీటీలోకి ష‌కీలా బ‌యోపిక్ – అడ‌ల్ట్ స్టార్ జీవితంలోని షాకింగ్ నిజాల‌తో!

 

Bold OTT: పోర్న్ స్టార్ షకీలా జీవితం ఆధారంగా రూపొందిన షకీలా మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ష‌కీలా మూవీలో బాలీవుడ్ బ్యూటీ రిచా చ‌ద్దా హీరోయిన్‌గా న‌టించింది.

 
షకీలా మూవీ
షకీలా మూవీ

 

Bold OTT: పోర్న్ స్టార్ ష‌కీలా జీవితం ఆధారంగా ష‌కీలా పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కింది. ఈ బ‌యోపిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రిచా చ‌ద్దా హీరోయిన్‌గా న‌టించింది. ఇంద్ర‌జీత్ లంకేష్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం కేవ‌లం హిందీలో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతోంది. ష‌కీలా హిందీ వెర్ష‌న్ ష‌మోరో ఓటీటీతో పాటు ఓటీటీ ప్లే యాప్‌లో అందుబాటులో ఉంది.

 

పంకజ్ త్రిపాఠి…

ష‌కీలా మూవీలో రిచా చ‌ద్దాతో పాటు పంక‌జ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై, ఎస్తేర్ నోరాన్హా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2020 డిసెంబ‌ర్‌లో ఈ బ‌యోపిక్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే ఈ మూవీహెచ్‌డీ ప్రింట్ పైర‌సీ ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో క‌లెక్ష‌న్స్‌పై గ‌ట్టిగా ప్ర‌భావాన్ని చూపించింది.

తెలియ‌ని నిజాల‌తో…

ష‌కీలా జీవితం గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని నిజాల‌ను ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు డైరెక్ట‌ర్ ఇంద్ర‌జీత్ లంకేష్ ప్ర‌మోష‌న్స్‌లో చెప్పాడు. గొప్ప న‌టిగా పేరు తెచ్చుకోవాల‌ని క‌ల‌లు క‌న్న ష‌కీలా శృంగార తార‌గా ఎలా మారాల్సివ‌చ్చింద‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ కావ‌డంతో కూడా మైన‌స్‌గా మారింది.

ష‌కీలా క‌థ ఇదే…

కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా ఇష్టం లేక‌పోయినా త‌ల్లి బ‌ల‌వంతం కార‌ణంగా అడ‌ల్డ్ సినిమాల్లో న‌టించ‌డానికి ఒప్పుకుంటుంది ష‌కీలా. కొద్ది రోజుల్లోనే పాపుల‌ర్ పోర్న్‌స్టార్‌గా మారిపోతుంది. అగ్ర హీరోల సినిమాలు సైతం ష‌కీలా సినిమాల‌తో పోటీప‌డ‌లేక‌పోయాయి. మ‌ల‌యాల స్టార్ హీరో స‌లీమ్…ష‌కీలా పేరు ప్ర‌ఖ్యాతుల‌ను దిగ‌జార్చేందుకు కుట్ర‌లు ప‌న్నుతాడు. ష‌కీలాపై స‌లీమ్ ప‌గ‌నుపెంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? స‌లీమ్ కుట్ర‌ల వ‌ల్ల ష‌కీలా జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

కెరీర్‌ను మ‌లుపు తిప్పే మూవీ…

ష‌కీలా జీవితాన్ని ఎలా సిల్వ‌ర్‌స్క్రీన్‌పై ఆవిష్క‌రించాల‌నే విష‌యంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ కావ‌డం ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కార‌ణ‌మైంది. త‌న కెరీర్‌ను మ‌లుపుతిప్పే మూవీ అవుతుంద‌ని రిచా చ‌ద్దా కూడా ప్ర‌మోష‌న్స్‌లో ఆశాభావం వ్య‌క్తం చేసింది. కానీ ఆమెకు ఈ బ‌యోపిక్ నిరాశ‌నే మిగిల్చింది.

అవార్డులు…

హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసిన రిచా చ‌ద్దా గ‌త ఏడాది రిలీజైన గ‌ర్ల్స్ విల్ బీ గ‌ర్ల్స్ మూవీతో ప్రొడ్యూస‌ర్‌గా మారింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ కావ‌డ‌మే కాకుండా అవార్డుల‌ను అందుకున్న‌ది.

 

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024