NNS 27th February Episode: అమర్ రూమ్‌లోకి అనామిక.. డోర్ లాక్.. భాగీని డిన్నర్‌కు తీసుకెళ్లడానికి అమర్ ప్లాన్

Best Web Hosting Provider In India 2024

NNS 27th February Episode: అమర్ రూమ్‌లోకి అనామిక.. డోర్ లాక్.. భాగీని డిన్నర్‌కు తీసుకెళ్లడానికి అమర్ ప్లాన్

 

NNS 27th February Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఫిబ్రవరి 27) ఎపిసోడ్లో భాగీని అమర్ డిన్నర్ కు తీసుకెళ్తానంటాడు. దీంతో ఆమె ఎగిరి గంతేస్తుంది.

 
భాగీని డిన్నర్‌కు తీసుకెళ్లిన అమర్.. ఎగిరి గంతేసిన మిస్సమ్మ
భాగీని డిన్నర్‌కు తీసుకెళ్లిన అమర్.. ఎగిరి గంతేసిన మిస్సమ్మ
 

NNS 27th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 27) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరికి వచ్చిన కోర్టు నోటీసులపై అమర్ కుటుంబం ఆందోళన చెందుతుంది. అయితే ఆ నోటీసులు రణ్‌వీర్ పంపిన విడాకులే అయినా మనోహరి మాత్రం అనాథాశ్రమానికి చెందినవంటూ అబద్ధమాడి తప్పించుకుంటుంది.

 

రణ్‌వీర్‌ను చంపడానికి కాళీ కొత్త ప్లాన్

ఎలాగోలా అమర్ నుంచి తప్పించుకొని వచ్చిన మనోహరికి కాళీ మరోసారి ఫోన్ చేస్తాడు. అసలు రణ్‌వీర్ ఎందుకు పిలిచాడని, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని అడుగుతాడు.

అనుమానం వస్తేనే ఇంత పని చేశాడంటే.. నువ్వే అని తెలిస్తే ఇంకేం చేస్తాడో అని మనోహరిని భయపెడతాడు కాళీ. దీంతో అతనిపై మండిపడిన మనోహరి.. ముందు అతన్ని చంపమని కాళీకి చెబుతుంది. తాను మరో ప్లాన్ వేశానని అతడు చెబుతాడు.

సెక్యూరిటీ పెంచిన రణ్‌వీర్

అటు రణ్‌వీర్ మాత్రం తనపై జరిగిన దాడి తర్వాత మరింత అప్రమత్తం అవుతాడు. తన ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచుతాడు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటాడు.

చంపడానికి వచ్చిన వాడి వెనుక ఎవరో ఉన్నారని, వాడు కచ్చితంగా మళ్లీ వస్తాడని తన అనుచరులతో రణ్‌వీర్ అంటాడు. మరోవైపు అదే రోజు రాత్రి రణ్‌వీర్ పై మరోసారి దాడి చేయడానికి కాళీ సిద్ధమవుతుంటాడు.

అమర్ రూమ్‌లో అనామిక.. డోర్ లాక్

అమర్ బయటి నుంచి వస్తూ భాగీ నీళ్లు తీసుకురా అంటూ తన రూమ్ లోకి వెళ్తాడు. ఆ సమయంలో భాగీ అక్కడ ఉండదు. అది విన్న అనామిక తానే నీళ్లు తీసుకొని అమర్ రూమ్ లోకి వెళ్తుంది. రాథోడ్ ఆమెను చూస్తాడు. సార్ రూమ్ లోకి వెళ్తోందేంటి అనుకొని.. అయినా మిస్సమ్మ కూడా ఉండే ఉంటుందిలే అనుకుంటాడు. అంతలో మిస్సమ్మ బయటి నుంచి వస్తుంది.

 

ఆమె రూమ్ లో లేదని తెలుసుకున్న రాథోడ్.. ఇప్పుడే అనామిక సార్ గదిలోకి వెళ్లిందని చెబుతాడు. దీంతో మిస్సమ్మ బాధపడుతూ కూర్చొంటుంది. అంతలో పైన గాలికి డోర్ క్లోజ్ అవుతుంది. అది కింది నుంచే విన్న భాగీ మరింత కుమిలిపోతుంది. అచ్చూ ఆమెకు గతంలో జరిగినట్లే జరుగుతోందని రాథోడ్ అనడంతో మిస్సమ్మ ఆందోళన చెందుతుంది. అనామిక డోర్ తీయడానికి ట్రై చేసినా అది రాదు.

భాగీని డిన్నర్‌కు తీసుకెళ్లడానికి అమర్ ప్లాన్

అటు భాగీని అమర్ డిన్నర్ కు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తాడు. తన రూమ్ లో నుంచి వస్తూ.. భాగీ అని పిలుస్తాడు. ఆ సమయంలో బయట ఉన్న ఆమె.. పరుగెత్తుకుంటూ లోనికి వచ్చి అమర్ పై పడబోతుంది. ఇంతలో అమర్.. పదా భోజనానికి బయటకు వెళ్దాం అని అంటాడు. దీంతో మిస్సమ్మ ఆనందానికి అవధులు ఉండవు.

అమర్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లుగా కలగంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? రణ్‌వీర్ పై కాళీ మరోసారి దాడి చేస్తాడా? అమర్ రూమ్ లో నుంచి అనామిక ఎలా బయటకు వస్తుంది? అనే విషయాలు తెలియాలంటే గురువారం (ఫిబ్రవరి 27) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024