Divorce After 50’S: వృద్ధాప్యంలో విడాకులు తీసుకుంటున్న జంటలు, ఎందుకో తెలిస్తే ఆశ్యర్యపోతారు!

Best Web Hosting Provider In India 2024

Divorce After 50’S: వృద్ధాప్యంలో విడాకులు తీసుకుంటున్న జంటలు, ఎందుకో తెలిస్తే ఆశ్యర్యపోతారు!

Ramya Sri Marka HT Telugu
Feb 27, 2025 10:30 AM IST

Divorce After 50’S: దశాబ్దాల పాటు కలిసి బతికిన జంటలు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? వృద్దాప్యంలో ఇలా విడాకులు తీసుకోవడం వెనక కారణాలేంటి? ఈ మధ్య కాలంలో ఇవి ఎందుకు మరింత సాధారణం అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

వృద్ధాప్యంలో విడాకులకు సిద్ధమైన జంట
వృద్ధాప్యంలో విడాకులకు సిద్ధమైన జంట (Freepik)

ఏళ్ల తరబడి కలిసి ఉన్న జంటలు, ఎన్నో ఒడిదుడుకులను కలిసి జయించిన భార్యభర్తలు విడాకుల వైపుకు ఎందుకు మొగ్గుతున్నారు? జీవితం సగానికి పైగా గడిచిపోయిన తర్వాత తమ బంధాన్ని ముగించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇటీవలి కాలంలో యాభై ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా విడిపోవడానికి కారణాలు ఏంటి? ప్రముఖ మానసిక ఆరోగ్య సలహాదారు, ఎన్నోవెల్ నెస్ వ్యవస్థాపకురాలు అరూబా కాబీర్ తన హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

వృద్ధాప్యంలో విడిపోవడాన్ని ఏమంటారు?

సోషల్ మీడియాలో ఈ మధ్య “గ్రే డివోర్స్”(Grey Divorce) అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. బహుషా దీనికి అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల్లో యుక్త, మధ్య వయస్సు వారి కన్నా వృద్ధుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తుందట. సెలబ్రిటీల్లో ఈ కల్చర్ ను ఎక్కువగా చూడచ్చు. దశాబ్బాలుగా కలిసి జీవించిని జంటలు వృద్ధాప్య దశలోకి చేరుకున్న తర్వాత విడాకులను ఎంచుకుంటున్నారు. వీరిలో కొందరు చట్టపరంగా విడిపోతుంటే మరి కొందరు విడివిడిగా పిల్లలతో కలిసి లేదా వారి సొంత ఊళ్లల్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇలా 50 ఏళ్లు దాటిన తర్వాత అంటే జుట్టంతా నెరిసిపోయిన తర్వాత వృద్ధాప్యంలో తీసుకునే విడాకులను గ్రే డివోర్స్ (Grey Divorce) అంటారు. దీన్నే ‘సిల్వర్ స్పిల్టింగ్’ అని కూడా అంటారు.

గ్రే డివోర్స్ వెనకున్న కారణాలేంటి?

గ్రే డివోర్స్ అంటే వయసులో పెద్దవాళ్లు విడిపోవడానికి కీలక కారణాలేంటంటే.. మునుపటి తరాలలో చాలా వివాహాలు భావోద్వేగ అనుకూలత కంటే నిబద్ధత, బాధ్యతతోనే కూడి ఉండేవి. ఒకసారి వివాహం చేసుకున్నామంటే ఎలాంటి వ్యక్తితో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచన వారిలో ఉండేది. కానీ కాలక్రమేణా, వ్యక్తుల ఆలోచనాస్తాయి పెరుగుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. రకరకాల కారణాలతో విడిపోతున్నారు.

వ్యక్తిగత సంతృప్తి కోసం..

ఇలాంటి సమయంలో వారి వైవాహిక జీవితం వారికి సంతృప్తినిస్తుందో లేదో కొనసాగించడం మంచిదో కాదో తెలుసుకునే సామర్థ్యం వ్యక్తుల్లో పూర్తిగా ఉంటుంది. ఈ వ్యక్తిగత జ్ణానంతోనే వృద్ధాప్య దశలో వ్యక్తిగత సంతృప్తి కోసం కొందరు, భాగస్వామి పట్ల ద్వేషంతో ఇంకొందరు, కేరీర్ అభివృద్ధి కోసం మరికొందరు విడిపోవాలని కోరుకుంటున్నారు.

ఎమ్టీ నెస్ట్ సిండ్రమ్‌తో..

50 ఏళ్లు దాటిన తర్వాత ఎక్కువ జంటలు విడిపోవడానికి మరో సాధారణ కారణం ఏంటంటే.. “ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్”(Empty Nest Syndrome). చాలా జంటలు భార్యభర్తల మధ్య సఖ్యత లేకున్నా కూడా పిల్లల కోసం కలిసి ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉందని కొందరు, పిల్లల మీద ప్రేమను చంపుకోలేక మరికొందరు భాగస్వామితో కలిసి ఉండటం ఇష్టం లేకుండా అలాగే జీవిస్తారు.

ఇలాంటి వారు పిల్లలు పెరిగి పెద్దయి ఇంటిని విడిచి పెట్టిన తర్వాత అంటే చదువుల కోసం, ఉద్యోగం కోసం లేక వివాహం చేసుకుని వేరుగా ఉంటున్న సమయంలో భాగస్వామితో మనసు చంపుకుని ఉండాల్సిన అవసరం లేదని ఫీలవుతారు.

శారీరక, మానసిక భావోద్వేగాలతో..

ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే జీవిత భాగస్వామి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండరు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు మారతాయి. అనారోగ్యాల బారిన పడతారు. వీటి కారణంగా శారీరకంగా, మానసికంగా భావోద్వేగాల సమస్యలు తలెత్తుతాయి. అవిశ్వాసం, వైరుధ్యం వంటివి ఏర్పడతాయి. భాగస్వాముల మధ్య దూరాన్ని సృష్టించి విడాకుల వరకూ వెళతాయి.

ఆర్థిక విభేదాలతో..

వృద్ధాప్యంలో విడిపోవడానికి ఆర్థిక విభేదాలు మరింత దోహదం చేస్తున్నాయి. మునుపటి తరాలలో, మహిళలు తరచుగా ఆర్థికంగా ఆధారపడేవారు, కానీ నేడు, చాలా మంది వృత్తి లేదా ఆర్థిక స్వాతంత్యం కలిగి ఉంటున్నారు. బానిసగా ఉండే కన్నా బంధం నుంచి విముక్తి పొందడం మేలని విడాకులను ఎంచుకుంటున్నారు.

గ్రే డివోర్స్ మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇలా లేటు వయసులో విడిపోవడం కొందరికి సంతృప్తికరమైన జీవితాన్ని ఇవచ్చు. అంటే వారు సంతోషంగా, స్వేచ్ఛగా. మరింత ఉత్సాహంగా జీవించేందుకు అనువుగా మారచ్చు.

మరికొందరికి భవిష్యత్తు అంతా ఒంటరిగా ఎలా గడపాలి, నాకంటూ ఎవరున్నారు అనే రకరకాల ఆలోచనలతో మరింత ఆందోళనకరంగా మారచ్చు. ఏదైమైనా దీని నుంచి బయటపడానికి వేరు వేరు మార్గాలను ఎంచుకోక తప్పదు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024