Karam Annam: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఐదు నిమిషాల్లో ఈ కారం అన్నం చేసుకోండి, టేస్టీగా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

Karam Annam: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఐదు నిమిషాల్లో ఈ కారం అన్నం చేసుకోండి, టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Feb 27, 2025 11:30 AM IST

Karam Annam: ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేకుండా అవుతాయి. బయటకు వెళ్లి తెచ్చే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే టేస్టీగా కారం అన్నం వండుకోండి. ఇది రుచిగా ఉంటుంది.

కారం అన్నం రెసిపీలు
కారం అన్నం రెసిపీలు (Ruchi Vantillu/Youtube)

ప్రతిరోజూ అన్నం, కూర, పప్పు వండే ఓపిక ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఐదు పది నిమిషాల్లో ఏవైనా రెడీ అయ్యే రెసిపీలను తయారుచేసుకుని తినాలనిపిస్తుంది. అలాంటి వాటిల్లో కారం అన్నం ఒకటి. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కారం అన్నం వండుకొని చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది ఐదు నుంచి పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ వంటకాన్ని చేసుకుంటే లంచ్ డిన్నర్ రెసిపీలు అద్భుతంగా ఉంటుంది. కారం అన్నం రెసిపీని ఇక్కడ ఇచ్చాము. మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇందులో పెద్దగా వేయాల్సిన పదార్థాలు కూడా ఉండవు. కాబట్టి సులువుగా అయిపోతుంది. మరీ కారంగా అనిపిస్తే కొంత నెయ్యి కలుపుకుని తింటే చాలు అద్భుతంగా ఉంటుంది.

కారం అన్నం రెసిపీకి కావలసిన పదార్థాలు

నూనె – ఒక స్పూను

నెయ్యి – ఒక స్పూను

ఉల్లిపాయ – ఒకటి

పల్లీలు – గుప్పెడు

కరివేపాకులు – గుప్పెడు

పచ్చిమిర్చి – మూడు

ఉప్పు – రుచికి సరిపడా

ఆవాలు – అర స్పూను

పసుపు – పావు స్పూను

అన్నం – రెండు కప్పులు

కారం – ఒక స్పూను

పచ్చి శనగపప్పు – ఒక స్పూను

జీలకర్ర – అర స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

కారం అన్నం రెసిపీ

1. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు లేదా కూరగాయలు లేనప్పుడు ఈ కారం అన్నం ప్రయత్నించండి.

2. మిగిలిపోయిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి అన్నం మొత్తం కలిసేలా కలుపుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, నెయ్యి వేయండి.

4. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.

5. పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

7. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ కారం అన్నం రెడీ అయినట్టే.

8. ఇప్పుడు దీన్ని సర్వ్ చేయడానికి సిద్ధం చేయాలి.

9. ఒక ప్లేట్లో ఈ కారం అన్నాన్ని వేసి ఉల్లిపాయలను సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.

10. ఇప్పుడు ఈ రైస్ ని తింటే అద్భుతంగా ఉంటుంది.

11. పక్కన ఎలాంటి రైతా, కర్రీ వంటివి అవసరం లేదు. దీనని లంచ్ బాక్స్ రెసిపీగా, డిన్నర్ రెసిపీగా కూడా వాడవచ్చు.

కారం అన్నం పెద్దలకు బాగా నచ్చుతుంది. పిల్లలకు కాస్త కారంగా అనిపించవచ్చు. ఒకవేళ పిల్లలకు చేయాల్సి వస్తే కారం వేయకుండా చేయండి. పచ్చిమిర్చితోనే చేయడం వల్ల కారం కాస్త తగ్గవచ్చు. లేదా పచ్చిమిర్చి వాడకుండా కారంతోనే చేయాలి. రెండూ కలిపితే స్పైసీ ఎక్కువైపోయి పిల్లలు ఇబ్బంది పడతారు. నూనెకు బదులు పూర్తిగా నెయ్యి వేసినా కూడా కారం చాలా వరకు తగ్గిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024