


Best Web Hosting Provider In India 2024

Kubera Release Date: క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర రిలీజ్ డేట్ ఇదే..
Kubera Release Date: క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలాంటి వాళ్లు నటిస్తున్న మూవీ కావడం విశేషం.
Kubera Release Date: కుబేర వచ్చేస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ కు ముహూర్తం పెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న క్రేజీ కాంబినేషన్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే.
కుబేర రిలీజ్ డేట్
కుబేర మూవీ రిలీజ్ డేట్ ను గురువారం (ఫిబ్రవరి 27) మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీ ఈ ఏడాది జూన్ 20న రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా లాంచ్ చేశారు. ఇందులో మూవీలోని ప్రధాన పాత్రలైన నాగార్జున, ధనుష్, జిమ్ సర్బాలను చూడొచ్చు. నాగ్, ధనుష్ ఫేస్ టు ఫేస్ ఉన్నట్లుగా ఈ పోస్టర్ రూపొందించారు.
మూవీ రిలీజ్ విషయాన్ని కుబేర అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. “పవర్ కు సంబంధించిన స్టోరీ.. సంపద కోసం జరిగే యుద్ధం.. విధి ఆడించే ఆట.. శేఖర్ కమ్ముల కుబేర అత్యద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ను అందించడానికి జూన్ 20న రాబోతోంది” అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ విషయం తెలిపారు. అటు రష్మిక మందన్నా కూడా రిలీజ్ డేట్ గురించి ట్వీట్ చేసింది.
కుబేర మూవీ గురించి..
కుబేర మూవీని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బాలాంటి వాళ్లు నటిస్తున్నారు. గతేడాది నవంబర్ లోనే మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉన్న స్టోరీ లైన్ ఏంటన్నది మాత్రం దీని ద్వారా రివీల్ కాలేదు.
సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటిస్తుండగా.. జిమ్ సర్బా ఓ కోటీశ్వరుడిగా కనిపించాడు. ఇక నాగార్జున రోల్ ఏంటో తేలాల్సి ఉంది. కుబేర మూవీ నుంచి గతంలోనే ధనుష్, నాగార్జున, రష్మికలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి.
ఇప్పటి వరకూ హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి యూత్‌ఫుల్ స్టోరీస్ తో వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తొలిసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కుబేర గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా ధనుష్, నాగార్జున, రష్మికలాంటి పెద్ద నటీనటులతోనూ అతడు తొలిసారి పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడు. ఈ కుబేరకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్