



Best Web Hosting Provider In India 2024

Mazaka OTT: సందీప్ కిషన్ లేటెస్ట్ కామెడీ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోనే! తొలి రోజు కలెక్షన్లు ఇలా..
Mazaka OTT: మజాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు ఓపెనింగ్ దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ దక్కించుకుందో సమాచారం వెల్లడైంది.
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం మంచి క్రేజ్ అడుగుపెట్టింది. ధమాకాతో మంచి హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు దర్శకుడు కావడంతో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉండడం కూడా ఆసక్తిని పెంచింది. ఈ కామెడీ మూవీ మజాకా ఈ బుధవారం (ఫిబ్రవరి 26) మహా శివరాత్రి సందర్భంగా రిలీజైంది. ఈ చిత్రం మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. కాగా, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఏదో కూడా వెల్లడైంది.
స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ ఇదే
మజాకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. మంచి క్రేజ్ ఉండటంతో రిలీజ్‍కు ముందు మంచి ధరకు ఓటీటీ డీల్ జరిగింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మేకర్లతో జీ5 ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. మార్చి చివరి వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే, ఒకవేళ థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు కొనసాగిస్తే.. స్ట్రీమింగ్ ఆలస్యం కూడా కావొచ్చు.
మజాకా చిత్రంలో సందీప్ కిషన్ సరసన రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. రావు రమేశ్ కీలకపాత్ర చేశారు. మన్మథుడు హీరోయిన్ అన్షు ఈ మూవీలో మరో ముఖ్యమైన క్యారెక్టర్లో నటించారు. సుమారు 23ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ ఓ మూవీలో చేశారు. కొడుకు, తండ్రి ప్రేమ కథలతో ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా త్రినాథరావు తెరకెక్కించారు. ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ బెజవాడ.. కథ, డైలాగ్స్ అందించారు.
మజాకా తొలిరోజు మోస్తరుగా..
మజాకా మూవీకి తొలి రోజు రూ.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. అంచనాలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుంది. మరి ఫుల్ రన్‍లో ఈ మూవీ ఎంత కలెక్షన్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీకెండ్‍లో వసూళ్లను బట్టి ఫలితం అర్థమవుతుంది. రూ.11కోట్ల ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్‍గా ఉంది.
హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ భన్సాల్.. మజాకా మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నిజార్ షరీఫ్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్