


Best Web Hosting Provider In India 2024

Ramadan 2025: రంజాన్ మాసంలో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహూర్‌లో ఏమి తినాలి?
Ramadan 2025: రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. తెల్లవారుజామున సహూర్ పేరుతో భోజనం ముగిస్తారు. అప్పుడు తిన్న ఆహారం రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఉండండి. శక్తిని అందించేలా, అలసట రాకుండా నివారించడానికి నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోవాలి.
రంజాన్ ముస్లిం సోదరులకు ముఖ్యమైన పండుగ. ఇది ఆధ్యాత్మిక మాసం. రంజాన్ మాసంలో క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. రంజాన్ సమయంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత మాత్రమే భోజనం తినాలి. ఆ మధ్య కాలంలో ఉపవాసం ఉండాలి. నీరు కూడా తాగకూడదు. సూర్యోదయానికి ముందు సహూర్ పేరుతో భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ తింటారు.
సహూర్ రోజులో ముఖ్యమైన భోజనం. ఇది రోజంతా శక్తిని అందించేందుకు ప్రధానమైనది. సమతుల్యమైన ఆహారం తింటే ఆ రోజంతా ఉపవాసం చేయగలరు. సహూర్ లో నెమ్మదిగా జీర్ణమయ్యే, ఫైబర్‌తో కూడిన ఆహారాలను ఎంచుకోవడం వల్ల మీరు ఎక్కువసేపు శక్తివంతంగా ఉండగలరు.
సహూర్ లో కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల హైడ్రేషన్ రాకుండా అడ్డుకోవడానికి, శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలోని ప్రధాన డైటీషియన్ లీనా మార్టిన్, ఆరోగ్యకరమైన, మరింత సంతృప్తికరమైన ఉపవాసం కోసం మీ ఉదయం భోజనంలో చేర్చాల్సిన ఉత్తమ ఆహారాలను HT లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.
1. ధాన్యాలు
ఓట్మీల్, గోధుమలు, బ్రౌన్ రైస్ లేదా క్వినోవా వంటివి ఆహారాలను ఎంచుకోవాలి. వీటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ ధాన్యాలు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండేలా ఉంచుతాయి. రక్తంలో చక్కెర పెరుగుదల, తగ్గుదలను నిరోధిస్తాయి.
2. ప్రోటీన్‌తో కూడిన ఆహారాలు
గుడ్లు, గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా లీన్ మాంసాలు (కోడి లేదా చేప వంటివి) వంటి ప్రోటీన్ వనరులను చేర్చడం వల్ల కండరాల మరమ్మత్తు జరుగుతుంది. ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల మీరు ఎక్కువసేపు శక్తివంతంగా ఉంటారు.
3. ఫైబర్‌తో నిండిన పండ్లు, కూరగాయలు
అరటిపండ్లు, ఆపిల్స్, పియర్స్, దోసకాయలు, ఆకుకూరలు వంటి అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఖర్జూరాలు.. సంప్రదాయ రంజాన్ ప్రధాన ఆహారం. సహజ చక్కెరలు, ఫైబర్‌ను అందిస్తాయి.
4. ఆరోగ్యకరమైన కొవ్వులు
అవోకాడోస్, బాదం, అక్రోట్లు, చియా, ఫ్లాక్స్ సీడ్స్, ఆలివ్ ఆయిల్ వంటివి ఆహారాల్లో భాగం చేసుకోవాలి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు తృప్తిని పెంచుతాయి. శక్తిని స్థిరంగా అందిస్తాయి.
5. హైడ్రేటింగ్ ఆహారాలు
ఉపవాసం సమయంలో అలసట, తలనొప్పిని నివారించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. పుచ్చకాయ, నారింజలు, దోసకాయలు, పెరుగు వంటి అధిక నీటి కంటెంట్‌తో కూడిన ఆహారాలు హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. వీటిని తగినంత నీటితో కలపడం వల్ల రోజంతా మెరుగైన సహనశక్తి లభిస్తుంది.
6. హెర్బల్ టీలు, తక్కువ చక్కెర పానీయాలు
నిర్జలీకరణానికి కారణమయ్యే కెఫిన్‌తో కూడిన పానీయాలకు బదులుగా, మెంతులు, నిమ్మకాయతో కూడిన హెర్బల్ టీలు తాగడం మంచిది. చక్కెర పానీయాలను తక్కువగా తినాలి.
తినకూడని ఆహారాలు
ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు తినకూడదు. అవి ఉబ్బరానికి దారితీస్తాయి.
అధిక చక్కెరతో కూడిన ధాన్యాలు, పేస్ట్రీలు కూడా తినకూడదు. ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచేస్తాయి. లేకపోతే తగ్గేలా చేస్తాయి. దీని వల్ల మీరు ఉపవాసం చేయలేరు.
అధికంగా ఉప్పుతో కూడిన ఆహారాలు కూడా తినకూడదు. ఇవి దాహాన్ని పెంచేస్తాయి. నిర్జలీకరణాన్ని పెంచుతాయి.
ఈ పోషకాలతో నిండిన, ఫైబర్‌తో కూడిన ఆహారాలను సహూర్‌లో చేర్చడం ద్వారా, వ్యక్తులు ఆరోగ్యంగా ఉపవాసం ఉండగలరు. ఇలా రంజాన్ సమయంలో ఉపవాసాన్ని ఆరోగ్యంగా నిర్వహించగలరు.
సంబంధిత కథనం