


Best Web Hosting Provider In India 2024

OTT Telugu Mystery Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. మరో రెండు సినిమాలు, వెబ్ సిరీస్ కూడా
OTT Telugu Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఇదే కాదు మరో రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ కూాడా రాబోతున్నాయి. ఈటీవీ విన్ ఓటీటీ రెండో వార్షికోత్సవం సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్ పై రాబోయే కొత్త కంటెంట్ లిస్ట్ రిలీజ్ చేసింది.
OTT Telugu Mystery Thriller: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటి ఈటీవీ విన్. గురువారం (ఫిబ్రవరి 27) ఈ ఓటీటీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉదయాన్ని ప్రేక్షకుల స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఆ ఓటీటీ తమ ప్లాట్‌ఫామ్ పై రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా వాటితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ నేరుగా రానుండగా.. మరికొన్ని థియేట్రికల్ రన్ తర్వాత రానున్నాయి.
కానిస్టేబుల్ కనకం ఓటీటీ రిలీజ్ డేట్
ఈటీవీ విన్ గురువారం (ఫిబ్రవరి 27) రిలీజ్ చేసిన సినిమాల జాబితాలో బాగా ఆసక్తి రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ కానిస్టేబుల్ కనకం. వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. త్వరలోనే ఈ సినిమా ఈటీవీ విన్ లోకి అడుగుపెట్టనుంది. టౌన్‌కి కొత్త కానిస్టేబుల్ ఒచ్చింది.. ఇంకా రప్ప రప్ప అనే క్యాప్షన్ తో ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. గతేడాది డిసెంబర్లోనే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తోన్నాడు. అడవిగుట్ట అనే ప్రాంతం నేపథ్యంలో కానిస్టేబుల్ కనకం మూవీ సాగనున్నట్లు డైరెక్టర్ తెలిపాడు. అడవిగుట్ట మిస్టరీని కనకం అనే కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేసింది అన్నది సినిమాలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు సమాచారం.
ఈటీవీ విన్‌లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
ఈటీవీ విన్ సీజన్ 2 మొదలైందంటూ తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఈ కానిస్టేబుల్ కనకంతోపాటు రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా అనే సినిమాలతోపాటు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ కూడా ఉంది.
ఇవే కాకుండా మట్టి కథలు, లైఫ్ పార్ట్‌నర్, లవ్ యు నానమ్మలాంటి సినిమాలు కూడా నేరుగా ఈటీవీ విన్ లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఇక సబ్‌ఇన్‌స్పెక్టర్ యుగంధర్, #డీఎం, హే హరిరామకృష్ణ జగన్నాథ, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఓటీటీలోకి వస్తున్నట్లు ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
పిల్లలకు కూడా..
ఈటీవీ విన్ లో మూవీస్, వెబ్ సిరీసే కాకుండా పిల్లల కోసం కూడా తెలుగులో ఎన్నో కార్టూన్ షోలను తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని కూడా ఇదే వీడియోలో ఆ ఓటీటీ పంచుకుంది. జంగిల్ బుక్, బాల్ బాహుబలి, అభిమన్యులాంటి కార్టూన్ షోలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఈ ఓటీటీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా తన వీడియోలో పొందుపరిచింది. ఈటీవీ విన్ ఓటీటీ కేవలం తెలుగులోనే కంటెంట్ అందిస్తోంది. రెండేళ్లుగా అలరిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ ఇకపైన కూడా మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో రానుంది.
సంబంధిత కథనం