Anxiety Vs Depression: డిప్రెషన్ ఆందోళన రెండూ వేరు వేరు అని మీకు తెలుసా? రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Anxiety Vs Depression: డిప్రెషన్ ఆందోళన రెండూ వేరు వేరు అని మీకు తెలుసా? రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Feb 27, 2025 08:30 PM IST

Anxiety Vs Depression: డిప్రెషన్, ఆందోళన రెండూ ఒకటే అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ రెండూ వేరు వేరట! ఇప్పటికైనా తేడా తెలుసుకుని తగిన జాగ్రత్తలు, కౌన్సిలింగ్ వంటివి తీసుకొండి. డిప్రెషన్ ఆందోళనల మధ్య ఉన్న తేడాను ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ్య వివరించారు.

డిప్రెషన్ ఆందోళనల మధ్య తేడా తెలుసుకోవడం ఎలా?
డిప్రెషన్ ఆందోళనల మధ్య తేడా తెలుసుకోవడం ఎలా? (shutterstock)

మనసుకు సంబంధించిన వ్యాధులను చాలా మంది ఒకేలా భావిస్తారు. ఉదాహరణకు డిప్రెషన్, ఆందోళన. చాలా మంది ఇవి రెండూ ఒకటే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వీటి మధ్య చాలా తేడా ఉంది. మీరు కూడా డిప్రెషన్, ఆందోళనను ఒకే సమస్యగా భావిస్తే తప్పులో కాలేసారని తెలుసుకోండి. ఎందుకంటే ఇవి రెండూ ఎక్కువ మంది ఎదుర్కొంటున్న మానసిన సమస్యలే అయినప్పటికీ రెండూ వేరు వేరు లక్షణాలతో కూడిన మానసిక వ్యాధులట. వీటి నుంచి తప్పించుకోకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఇవి వ్యక్తిని చావు అంచుల వరకూ తీసుకెళతాయి.

కాబట్టి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటనే తగిన పరిష్కారాన్ని కనుగొనచ్చు. డిప్రెషన్, ఆందోళనల మధ్య ఉన్న తేడాలేంటో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ తన సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఇది రెండు వేర్వేరు వ్యాధులకు చికిత్స చేయడంలో మీకు సహాయపడుతుంది.

ఆందోళన, డిప్రెషన్ వేరు వేరు అని చెప్పే 3 లక్షణాలు..

మొదటి తేడా

  • ఆందోళన ఉన్నవారు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయం, పెద్ద విషయం అనే తేడా లేకుండా, ఆలోచించాల్సిన అవసరం లేకుండా నిరంతం ఆలోచిస్తూనే ఉంటారు. వారి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటుంది.
  • డిప్రెషన్ ఉన్నవారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. వారి మనసు ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. వారు దేని గురించీ ఆలోచించరు.

రెండవ తేడా

  • ఆందోళన ఉన్నవారు సాధారణంగా అంటే చూడటానికి బాగానే ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఏదైనా ఊహించని విషయం జరిగితే లేదా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే చాలా భయపడిపోతుంటారు, పానిక్ అయిపోతారు.
  • డిప్రెషన్ ఉన్నవారికి బయటి ప్రపంచంలో జరిగే మంచి చెడు సంఘటనలతో ఎలాంటి సంబంధమే ఉండదు. వారు ఎల్లప్పుడూ విచారంగా, బాధగా ఉంటారు. సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా దీన్నే మెయింటేన్ చేస్తారు.

మూడవ తేడా

  • ఆందోళన ఉన్నవారు తమను తాము చాలా ముఖ్యమైనవారుగా భావిస్తారు. వారు తామే ప్రతి ఒక్కరికీ కేంద్రంగా ఉంటారని భావిస్తారు. వారు లేకుండా ఇంట్లో, కుటుంబంలో, ఆఫీసులో ఏ పని జరగదని ఫీలవుతారు. వారి కుటుంబం గురించి వారికి ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. వారు లేకుంటే వారి కుటుంబానికి ఏమి జరుగుతుందో అని అనవరమైన ఆలోచనలతో ఆందోళనగా జీవిస్తారు. అలాంటి వారు ఎల్లప్పుడూ తమను, తమ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు.
  • ఇక డిప్రెషన్ తో బాధపడుతున్న వారు వారు తమను తాము నిరుపయోగంగా భావిస్తారు. వారు ఏ పని చేయలేరనీ, ఎవరికీ పనికి రాని వారని, వారు బాగుండకూడదని భావిస్తారు. డిప్రెషన్ ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వడం చాలా ముఖ్యం.

మీరు గానీ మీ చుట్టు పక్కల వారు గానీ ఈసమస్యలతో బాధపడుతున్నట్లయితే తేడాలను గమనించి ఆందోళన, డిప్రెషన్‌లకు తగిన చికిత్స లేదా కౌన్సిలింగ్ వంటివి తీసుకోవాలని సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ వివరించారు. వీటి నుంచి బయటపడటం కోసం వ్యాయామాలు, యోగా, ఆహార నియమాల్లో కొన్ని మార్పులు తప్పనిసరి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024