




Best Web Hosting Provider In India 2024

OTT Horror: ఓటీటీలోకి న్యూ తెలుగు హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. 120 ఏళ్ల నాటి దెయ్యాలను కలిస్తే.. ఇక్కడ చూసేయండి!
Aghathiyaa OTT Streaming: ఓటీటీలోకి న్యూ తమిళ, తెలుగు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ అగత్యా స్ట్రీమింగ్ కానుంది. 120 ఏళ్ల కాలం నాటి దెయ్యాలను కలిసే కథ చుట్టూ తిరిగే ఈ సినిమాలో రాశీ ఖన్నా, జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించారు. నెల క్రితం థియేటర్లలో విడుదలైన అగత్యా ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకుందాం.

Aghathiyaa OTT Release: ఓటీటీ హారర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వచ్చి సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీస్‌ను ఓటీటీ లవర్స్ ఆలస్యం చేయకుండా చూసేస్తారు. ఇప్పుడు అలాంటి వారికోసం న్యూ తమిళ, తెలుగు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
హారర్ ఫాంటసీ థ్రిల్లర్
కోలీవుడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా అగత్యా. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథ, దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ తెరకెక్కింది.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన అగత్యా ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో అగత్యా థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీంతో ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.
అగత్యా బడ్జెట్-కలెక్షన్స్
అగత్యా సినిమాను దాదాపుగా రూ. 20 నుంచి 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 2.15 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది అగత్యా సినిమా. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 5 రేటింగ్ అందుకున్న అగత్యా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. సరిగ్గా నెల రోజులకు అగత్యా ఓటీటీ రిలీజ్ కానుంది. తాజాగా ఇవాళ (మార్చి 24) అగత్యా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చింది.
సన్ ఎన్ఎక్స్‌టీలో అగత్యా ఓటీటీ రిలీజ్ కానుంది. మార్చి 28 నుంచి అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అగత్యా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. కాగా అగత్యా సినిమా హారర్ థ్రిల్లర్‌కు ఫాంటసీ యాడ్ చేసి తెరకెక్కించారు.
120 ఏళ్ల నాటి ఆత్మలు
అగత్యా కథలోకి వెళితే.. ఒక పరిశోధన కోసం జీవా, రాశీ ఖన్నా ఓ పాత బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ వారికి విచిత్రపు సంఘటనలు ఎదురవుతాయి. అక్కడ ఏం జరిగింది?, ఆ ప్లేసుకు జీవా, రాశీ ఖన్నాకు ఉన్న సంబంధం ఏంటీ?, అర్జున్ సర్జా పాత్ర ఏంటీ? అనేదే అగత్యా కథ.
ఏంజెల్స్ వర్సెస్ డెవిల్ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అగత్యాలో 120 ఏళ్ల నాటి ఆత్మలను (దెయ్యాలను) కలుసుకుని జీవా ఏం చేశాడనేది సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఇక ఈ మూవీలో జీవా ఆర్ట్ డైరెక్టర్‌గా కనిపిస్తే అర్జున్ సర్జా సిద్ధ వైద్యం, రీసెర్చర్ పాత్ర పోషించాడు ఎన్ఆర్ఐ యువతిగా రాశీ ఖన్నా కనిపించింది.
సంబంధిత కథనం