ఏపీ పీజీ సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. మే 11వరకు దరఖాస్తు చేయొచ్చు..గణనీయంగా తగ్గిన దరఖాస్తులు

Best Web Hosting Provider In India 2024

ఏపీ పీజీ సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. మే 11వరకు దరఖాస్తు చేయొచ్చు..గణనీయంగా తగ్గిన దరఖాస్తులు

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

ఏపీ పీజీసెట్-2025 దరఖాస్తు గడువు పొడిగించారు. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు పీజీసెట్ నిర్వహించనున్నారు. మే 5తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా మే 11 వరకు పొడిగించినట్టు కన్వీనర్‌ ప్రకటించారు.

ఏపీ పీజీసెట్ 2025 దరఖాస్తులు గడువు పొడిగింపు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీలో యూనివర్శిటీ క్యాంపస్‌ కాలేజీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైంది. మే 5వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా దానిని మే 11 వరకు పొడిగించినట్టు ఎస్వీ యూనివర్శిటీ ప్రకటించింది.

ఏపీ పీజీసెట్ -2025 దరఖాస్తులను సమర్పించడానికి గడువును పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సెట్ చైర్మన్ ఆచార్య అప్పారావు, కన్వీనర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ ఏడాది పీజీ సెట్‌ నిర్వహణ బాధ్యతలను ఎస్వీ యూనివర్శిటీకి అప్పగించారు. పీజీ సెట్‌కు మార్చి నెలాఖరులో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 5వ తేదీ వరకు ఉన్న గడువును 11వ తేదీ వరకు పొడిగింరు.

పీజీ సెట్‌కు రూ. 1000 అపరాధ రుసుంతో మే 15వ తేదీ వరకు, రూ.2000తో మే 20వ తేదీ వరకు, రూ.4,000 అపరాధ రుసుంతో మే 24వ తేదీ వరకు, రూ.10,000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పీజీ కోర్సుల్లో యూనివర్శిటీ అనుబంధ కళాశాలల్లో మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేస్తుండటంతో దరఖాస్తు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

దరఖాస్తు చేయడం ఇలా..

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ గత మార్చిలో విడుదలైంది. పీజీసెట్ ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఎంఏ /ఎంకాం/ ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

ఏపీ పీజీఈసెట్ అప్లికేషన్లు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం అయ్యాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 9 నుంచి 13 వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో ఉన్న 17 యూనివ‌ర్శిటీ, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 156 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవ‌త్సరానికి ప్రవేశాల క‌ల్పించేందుకు ఈ సెట్‌ను నిర్వహిస్తారు. దీనికి డిగ్రీలో ఆయా స‌బ్జెక్టులను ఉత్తీర్ణత పొందిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

ఏపీ పీజీ సెట్‌ ఆన్‌లైన్ ఎగ్జామ్ జూన్ 9 నుంచి 13 వ‌ర‌కు జ‌రుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ణ‌యించిన ప‌రీక్షా కేంద్రాల్లో ప్రవేశ‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు, పీజీసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in ను సంద‌ర్శించాలి.

ఇవే కోర్సులు

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌, ఎంఈడీ, ఎంపీఈడీ ఎమ్మెస్సీ టెక్నాల‌జీ వంటి కోర్సుల్లో ప్రవేశాల‌కు పీజీ కామ‌న్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు క‌ల్పిస్తారు. అయితే సెట్‌లో వ‌చ్చిన ర్యాంక్ ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు. దీనికి సంబంధించిన ప‌రీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

దీనికి సంబంధించిన నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వర యూనివ‌ర్శిటీ (ఎస్‌వీయూ) చూస్తోంది. నోటీఫికేష‌న్ నుంచి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫలితాలు వెల్లడి, కౌన్సిలింగ్ వంటి ప్ర‌క్రియ‌ల‌న్నీ ఎస్‌వీయూ నిర్వ‌హిస్తోంది.

మూడు కేటగిరీల్లో పరీక్ష‌లు

ద‌రఖాస్తు దాఖ‌లు చేసేటప్పుడు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి వ‌స్తుంది. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు దాదాపు రూ.850, బీసీల‌కు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.650 ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ప్ర‌వేశ ప‌రీక్ష మూడు కేట‌గిరీల్లో ఉంటుంది. కేట‌గిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్‌, సోష‌ల్ సైన్స్‌స్ కోర్సులు ఉండ‌గా, కేట‌గిరీ-2లో కామ‌ర్స్ అండ్ ఎడ్యుకేష‌న్ కోర్సు ఉంటుంది. కేట‌గిరీ-3లో సైన్స్ స‌బ్జెక్టులు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap UniversitiesEntrance TestsExamsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024